Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి ఇంటినీ లెక్కిస్తాం: జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి

ప్రతి ఇంటినీ లెక్కిస్తాం: జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి

వార్త 2 months ago

Telangana Census: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని, ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా లెక్కిస్తామని జనగణన (Census) తెలంగాణ డైరెక్టర్ భారతీ హోళికేరి ప్రకటించారు.

జనగణన ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్, విధివిధానాలను ఆమె వెల్లడించారు.

Read Also : Kavitha: రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామని అక్కడికి పోయారు: కేసీఆర్‌పై కవిత ఎద్దేవా

 We will count every household: Census Director Bharathi Holikeri

ప్రతి నిర్మాణానికీ లెక్కింపు

కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, ఆసుపత్రులు, పాఠశాలలు, గుళ్లు, చివరికి గుడిసెలతో సహా ఏ భవనాన్ని వదలకుండా కౌంట్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రతి భవనంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తారని తెలిపారు.

Telangana Census: రేపటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్

ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వీయ గణన’ (Self Enumeration) ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మే 11వ తేదీ వరకు ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు భవనాలపై మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారని భారతీ హోళికేరి వివరించారు. ఈ బృహత్తర ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

రేషన్ కార్డు ఇ-కెవైసి అప్డేట్ చేసుకోండిలా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha