Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదిరిపోయే లుక్స్.. పనోరమిక్ సన్‌రూఫ్‌తో రానున్న కియా కొత్త SUV!

అదిరిపోయే లుక్స్.. పనోరమిక్ సన్‌రూఫ్‌తో రానున్న కియా కొత్త SUV!

వార్త 3 days ago

Kia Sorento New Teaser: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన వాహన శ్రేణిని మరింత విస్తరించేందుకు కియా సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు సక్సెస్‌ఫుల్ SUVలు, MPVలతో మార్కెట్‌లో గుర్తింపు పొందిన కియా, త్వరలోనే 'కియా సోరెంటో' (Kia Sorento) ను భారత్‌లో ఆవిష్కరించనుంది.

లాంచ్‌కు ముందే ఈ కొత్త SUVకి సంబంధించిన టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. టీజర్‌లో వాహనం ముందు భాగం డిజైన్, ఐకానిక్ 'టైగర్ నోస్' (Tiger Nose) గ్రిల్, కొత్త కియా లోగో, ఐస్ క్యూబ్ డిజైన్ LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లతో ఉన్న ఆకర్షణీయమైన లుక్ వెల్లడైంది

Read Also : 10kg Gas Cylinder:కొత్తగా 10 కేజీల ఫైబర్ సిలిండర్.. బుక్ చేసిన 4 గంటల్లోనే డెలివరీ!

 Stunning looks… Kia’s new SUV coming with a panoramic sunroof!

Kia Sorento New Teaser: అత్యంత అధునాతన ఫీచర్లు

ప్రీమియం SUV విభాగంలో పోటీ పడేందుకు వీలుగా కియా సోరెంటోలో పలు అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు పొందుపరిచారు. ఇందులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు సెక్యూరిటీ కోసం ‘లెవల్-2 ADAS’ (Level-2 ADAS) టెక్నాలజీ అందించనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు, బుకింగ్స్

కియా సోరెంటోలో 1.6-లీటర్ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. దీనితో పాటు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణంలో మెరుగైన మైలేజ్, పవర్‌ అందించడమే లక్ష్యంగా కియా ఈ పవర్‌ట్రెయిన్‌లను డిజైన్ చేసింది. లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, అన్-అఫీషియల్‌గా ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవడం వల్ల త్వరలోనే కార్ ప్రేమికుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఆఫర్ల పండగ.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు డిస్కౌంట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha