Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆఫర్ల పండగ.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు డిస్కౌంట్!

ఆఫర్ల పండగ.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు డిస్కౌంట్!

వార్త 4 days ago

Amazon Freedom Sale 2026: కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా గృహోపకరణాలు (Home Appliances) కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక గుడ్ న్యూస్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన మోస్ట్ అవైటెడ్ 'అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026' (Amazon Freedom Sale 2026) ని ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు అన్ని కేటగిరీల ఉత్పత్తులపై కస్టమర్లకు భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్ కోసం అమెజాన్ తన వెబ్‌సైట్ మరియు యాప్‌లో ప్రత్యేక ల్యాండింగ్ పేజీని కూడా లైవ్ చేసింది.

Read Also :China bans paper gold : పేపర్ గోల్డ్ ను బ్యాన్ చేసిన చైనా..తీవ్ర ఆందోళనలో ప్రపంచ దేశాలు!

Amazon Freedom Sale 2026: ఆఫర్లు & డిస్కౌంట్లలో ప్రధాన ముఖ్యాంశాలు

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాలపై గరిష్టంగా 80% వరకు తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్లతో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ (Instant Discount) లేదా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బడ్జెట్ రేంజ్ ఫోన్ల నుంచి ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్ల వరకు అన్ని ప్రముఖ బ్రాండ్లపై భారీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పవర్ బ్యాంక్‌లు, చార్జర్‌లు, హెడ్‌ఫోన్స్ వంటి మొబైల్ యాక్సెసరీలు కూడా అత్యంత చౌకగా లభించనున్నాయి. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలపై ప్రత్యేక పండగ ఆఫర్లు ఉండనున్నాయి. స్మార్ట్ షాపింగ్ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే తమ కోరికల జాబితాను (Wishlist) సిద్ధం చేసుకోవడం మంచిది!

కొత్త గ్యాస్ కనెక్షన్లు బంద్.. నగరంలో కష్టాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha