Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత!

అఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత!

వార్త 4 months ago

Shapoor Zadran: అఫ్గానిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాళ్లను క్రియేట్ చేసిన స్టార్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (Shapoor Zadran) కన్నుమూశారు.

గత కొన్ని నెలలుగా ‘హేమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతక రోగనిరోధక శక్తి (Immune System) లోప వ్యాధితో బాధపడుతున్న ఆయన.. దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూలై 7) మరణించారు. తన 39వ పుట్టినరోజుకు సరిగ్గా ఒకరోజు ముందే ఆయన మరణించడం క్రీడా లోకాన్ని కలిచివేస్తోంది. జద్రాన్ మృతి పట్ల అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Suryakumar Yadav: తప్పుడు ప్రచారాలు నమ్మకండి.. వైరల్ ఫేక్ స్టేట్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సూర్య

అరుదైన వ్యాధితో సుదీర్ఘ పోరాటం

షాపూర్ జద్రాన్ గత ఏడాది అక్టోబర్ నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో ఆయనను దిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడం, అది మెదడు మరియు ఊపిరితిత్తులకు (టీబీ రూపంలో) వ్యాపించడంతో ఆయన పరిస్థితి విషమించింది. మధ్యలో కొద్దిగా కోలుకున్నప్పటికీ, మళ్లీ ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని జద్రాన్ సోదరుడు ఘమాయ్ జద్రాన్ వెల్లడించారు.

అఫ్గాన్ రథసారథి – చారిత్రాత్మక విజయాలు

అఫ్గానిస్తాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ పటంలో ఒక బలమైన శక్తిగా ఎదగడంలో షాపూర్ జద్రాన్ పోషించిన పాత్ర అమోఘమైనది. ఎడమచేతి వాటం పేసర్‌గా తనదైన శైలిలో దూకుడుగా బౌలింగ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ సాధించిన మొట్టమొదటి చారిత్రాత్మక విజయానికి షాపూరే హీరో. స్కాట్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి వికెట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆ టోర్నీలో ఆయన మొత్తం 10 వికెట్లు పడగొట్టారు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జద్రాన్.. అఫ్గాన్ తరఫున మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు (44 వన్డేలు, 36 టీ20లు) ఆడి 80 వికెట్లు పడగొట్టారు. (వన్డేల్లో 43, టీ20ల్లో 37 వికెట్లు). 2020లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆయన, 2025 జనవరిలో క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు.

Shapoor Zadran: అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఘన నివాళి

“అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు పునాది వేసిన మహనీయులలో షాపూర్ జద్రాన్ ఒకరు. ఆయన అంకితభావం, ఆట పట్ల ఉన్న ఉద్వేగభరితమైన ప్రేమ దేశంలో క్రికెట్ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో యువ అఫ్గాన్ క్రికెటర్లకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత” అని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ప్రకటనలో భావోద్వేగంగా నివాళులర్పించింది.

Epaper: epaper.vaartha.com

ఫుట్‌బాల్ స్టార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha