AP Fire Department: రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సేవల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. మంగళవారం సచివాలయంలో అగ్నిమాపక శాఖపై నిర్వహించిన సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు, సాంకేతికతను జోడించి రెస్పాన్స్ టైం తగ్గించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also:NEET (UG) 2026: ప్రశ్నాపత్రాల లీకుల తర్వాత నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు..విద్యార్థి సంఘాల నిరసన
AP Fire Department: 1,275 పోస్టుల భర్తీ.. నిరుద్యోగులకు ఊరట
శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది కొరతపై మంత్రి స్పందించారు. మొత్తం 1,275 ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా, ప్రస్తుతం జాబ్ క్యాలెండర్‌లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు.
రెస్పాన్స్ టైం 15 నిమిషాలకే!
అగ్నిప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాలు చేరుకునే సమయం (రెస్పాన్స్ టైం) ప్రస్తుతం 25-30 నిమిషాలుగా ఉంది. దీన్ని 15 నిమిషాలకు తగ్గించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతి నిమిషం విలువైనదని ఆమె గుర్తు చేశారు.అడవి మంటల నివారణకు అధునాతన డ్రోన్లను వినియోగించాలని, పాఠశాలలు, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. సింగపూర్, స్విట్జర్లాండ్ , చండీగఢ్ వంటి ప్రాంతాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి, ఏపీలో అమలు చేయడానికి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

