Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో తల్లుల ఖాతాల్లోకి నగదు

త్వరలో తల్లుల ఖాతాల్లోకి నగదు

వార్త 1 week ago

Talliki Vandanam Scheme Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే, విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది.

ఈ ఏడాది కూడా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుమారు 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు సమాచారం.

Read Also: AP Transgender Welfare Board: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ సర్కార్ కీలక అడుగు

క్షేత్రస్థాయిలో డేటా వెరిఫికేషన్

పథకానికి అర్హులైన విద్యార్థుల వివరాలను అధికారులు ఇప్పటికే పాఠశాలల నుంచి సేకరించారు. ఈ సమాచారాన్ని తనిఖీ నిమిత్తం సచివాలయాలకు పంపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సంక్షేమ కార్యదర్శులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఈ డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆధార్ వివరాలు, పాఠశాల హాజరు, ఇతర అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 Talliki Vandanam AP 2026

అనర్హుల తొలగింపు.. అర్హుల ఎంపిక

ప్రస్తుతానికి ప్రాథమికంగా 78 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించినప్పటికీ, తనిఖీ ప్రక్రియలో భాగంగా అనర్హులను తొలగించనున్నారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం వర్తించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే తుది జాబితాను విడుదల చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిధుల విడుదల కార్యక్రమం చేపట్టనున్నారు.

తనిఖీల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో, అతి త్వరలోనే ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనివ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం, డ్రాపౌట్స్ తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

Talliki Vandanam Scheme Update:

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తిరుమలలో నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha