Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అగ్రకులాలకు లేని ఆంక్షలు దళితులకే ఎందుకు?

అగ్రకులాలకు లేని ఆంక్షలు దళితులకే ఎందుకు?

వార్త 2 months ago

Manda Krishna Madiga: ఎస్సీల మత స్వేచ్ఛను హరించే ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం వివక్షతకు ప్రతిరూపమని ఎంఆర్ పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఈమేరకు సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆయన మాట్లాడుతూ ‘కుల వివక్షతను రూపుమాపడం చేతకానప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయండి. ఓసి, బిసి క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు ? క్రైస్తవాన్ని ప్రచారం చేసే మత ప్రచారకులంతా అగ్రకులాలే. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 25కు పూర్తి విరుద్ధం. హిందూ దేవాలయాలలోకి రావద్దు ఇంకో మతంలోకి వెళ్ళద్దు అని దళితులకు ఆంక్షలు పెట్టడం దుర్మార్గం.

Read Also:Amanagallu crime:భార్య, కొడుకును చంపి.. కూతురిని ఆసుపత్రి పాలు చేసిన తండ్రి

 Manda Krishna Madiga: Why are there restrictions for Dalits that upper castes don’t have?

Manda Krishna Madiga: సామాజిక హోదా మారదు

ఏమి తినాలో, ఎలా ఉండాలో, ఎక్కడికి వెళ్లాలో, ఏ విశ్వాసాలు పాటించాలో మీరే నిర్ణయిస్తారా ? గాంధీ అనుచరుల కుట్రల వల్ల దళిత క్రైస్తవులు హక్కులు కోల్పోయారు. రాజ్యాంగ సమయంలో క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించింది అగ్రకులాలే. అందువల్లనే దళిత క్రైస్తవుల హక్కులపై వాళ్ళు మాట్లాడ లేదు. క్రైస్తవంలోకి వెళితే బ్రాహ్మణుల, రెడ్డిల కమ్మల, వెలమ కులస్తుల సామాజిక హోదా మారనప్పుడు దళితులు ఎస్సీ హోదా ఎందుకు మారుతుంది.? క్రైస్తవంలోకి మారిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి మారిన దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పొందకూడదు? కుల వ్యవస్థ వల్ల దళితులు పశువుల కన్నా హీనంగా చూడబడ్డారు.

అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీలే పూజారులుగా ఉండాలి

కుల వ్యవస్థ వల్లనే హిందూమతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించలేకపోయింది. క్రైస్తవం, ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటే హిందూ మతం ఎందుకు ప్రభావం చుపెట్టలేకపోతుందో ఆలోచించి లోపాలు సరి చేసుకోవాలి. అఖండ భారత్ నుండి ప్రస్తుత భారత్ మిగిలింది.. కుల వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రస్తుత భారత్ కూడా మిగలదేమో అని ఆందోళనగా ఉంది. హిందూ దేవాలయాలు అందరివి అయినప్పుడు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఎందుకు ఉండా లి.? అయోధ్య మొదలుకొని అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పూజారులుగా నియమించాలి “అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఇంజం వెంకటస్వామి, సోమశేఖర్ మాదిగ, జేపీ లత మాదిగ,కార్తీక్ మాదిగ, టీవీ నరసింహ మాదిగ, శివ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మహేశ్వరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha