Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AI మంత్రిత్వ శాఖను ప్రారంభించిన కేరళం సర్కార్

AI మంత్రిత్వ శాఖను ప్రారంభించిన కేరళం సర్కార్

వార్త 4 days ago

AI Ministry : భారతదేశంలో సాంకేతిక విప్లవానికి కేరళ రాష్ట్రం మరోసారి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, కొత్తగా అధికారం చేపట్టిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను (AI Ministry) ప్రారంభించింది. రాష్ట్రంలో సరికొత్త ఏఐ బేస్డ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనే బలమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేతృత్వంలోని క్యాబినెట్ ఈ అడుగు వేసింది. సీఎం సతీశన్ మంత్రివర్గంలో సీనియర్ నాయకులు పి.కె. కున్హాలికుట్టి ఈ ప్రతిష్టాత్మకమైన ఏఐ మరియు ఐటీ (AI & IT) శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా కేరళను మార్చే క్రమంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also : యూపీలో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..న్యాయం కోసం ఆర్తనాదాలు!

పెట్టుబడులే లక్ష్యంగా కొత్త పాలసీ.. సాంకేతిక రంగంలో కేరళ సరికొత్త మైలురాయి!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఐటీ రంగంలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం కోసమే ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి, కేరళలో గతంలో ఉన్న ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక 'ఏఐ పాలసీ'ని తీసుకురావడానికి ముసాయిదా ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుత యూడీఎఫ్ ప్రభుత్వం ఆ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తూ, నేరుగా మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది. మంత్రి పి.కె. కున్హాలికుట్టి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కేరళవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్లు, స్టార్టప్స్ మరియు ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగాన్ని పెంచేలా భారీ కార్యాచరణను రూపొందిస్తున్నారు. విద్యా, వైద్య, రవాణా రంగాలలో ఏఐ టూల్స్ వాడకం ద్వారా కేరళ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha