UP Doctors: దేశ సరిహద్దుల్లో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే ఒక జవాన్, ఇప్పుడు కన్నతల్లి తెగిపోయిన చేతిని పట్టుకుని న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది.
వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చేయిని తొలగించాల్సి వచ్చిందంటూ ఆ జవాన్ కన్నీరుమున్నీరవుతున్నాడు. మూడు రోజులుగా తెగిన చేతితోనే పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆ జవాన్ ఆవేదన ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also: 'They Don't Have Parents': పిల్లలను బస్సులో వదిలేసి..ప్రియుడితో పారిపోయిన తల్లి
UP Doctors
అసలేం జరిగిందంటే..?
మహారాజ్పుర్కు చెందిన వికాస్ సింగ్ అనే వ్యక్తి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 32వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో ఉన్నాడు. మే 13న అతడి తల్లి ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో, ఆమెను సమీపంలోని కృష్ణ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. అయితే, మరుసటి రోజు ఉదయం ఆమె స్పృహలోకి వచ్చేటప్పటికి కుడి చేయి పూర్తిగా నల్లగా మారిపోయి, వాచిపోయి ఉంది. ఐవీ కాన్యులా (IV Cannula) అమర్చడంలో జరిగిన లోపం వల్లే ఇలా జరిగిందని గ్రహించిన వికాస్ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
UP Doctors: 24 గంటల్లో ఆగిపోయిన రక్త ప్రసరణ
పరిస్థితి విషమిస్తుండటంతో వికాస్ తన తల్లిని అక్కడి నుండి డిశ్చార్జ్ చేయించి పారస్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు… మణికట్టు దాటి చేతికి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయిందని తేల్చారు. ఇన్ఫెక్షన్ శరీరమంతటా వ్యాపించి ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మే 17న ఆమె కుడి చేయిని వైద్యులు తొలగించారు.
మూటగట్టిన తెగిన చేతితో పోలీస్ స్టేషన్‌కు..
వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తల్లి వికలాంగురాలిగా మారడంతో తీవ్ర మనోవేదనకు గురైన జవాన్ వికాస్, ఆ తెగిన చేతిని ఒక మూటలో వెంట తీసుకుని రెల్‌బాజార్ పోలీస్ స్టేషన్‌కు, ఆపై అదనపు పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లాడు. “అందరూ కేవలం కాగితాలు తీసుకుంటున్నారు తప్ప ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. మూడు రోజులుగా నా తల్లి తెగిన చేతిని మోసుకుంటూ తిరుగుతున్నాను. దేశాన్ని రక్షించే నాకే న్యాయం జరగడం లేదు” అంటూ అతడు దీనంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు కేసును పూర్తి స్థాయిలో విచారించాలని సీఎంఓ (CMO) కు లేఖ రాశారు. విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక రాగానే బాధ్యులైన కృష్ణ ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరేట్ స్టాఫ్ ఆఫీసర్ అమర్‌నాథ్ యాదవ్ హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

