Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఐటీ-బాంబేలో విద్యార్థి ఆత్మహత్య..ప్రొఫెసర్ పై తీవ్ర ఆరోపణలు

ఐఐటీ-బాంబేలో విద్యార్థి ఆత్మహత్య..ప్రొఫెసర్ పై తీవ్ర ఆరోపణలు

వార్త 1 week ago

IIT-Bombay : ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య, దాని తర్వాత వెలుగులోకి వచ్చిన కుల వివక్ష ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

పరీక్షలో విద్యార్థి మొబైల్‌ ఫోన్, చాట్‌జీపీటీ ఉపయోగించాడన్న అంశం నుంచి మొదలైన వివాదం.. చివరకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదయ్యే వరకు వెళ్లింది. అయితే, విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణలను ఐఐటీ-బాంబే ఖండించింది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ-బాంబేలో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వకోడ్ ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఘటనకు ముందు జరిగిన పరీక్ష, చాట్‌జీపీటీ వినియోగం, అనంతరం విద్యార్థి తండ్రి చేసిన కుల వివక్ష ఆరోపణలు.. ఇలా వరుస పరిణామాలు వివాదానికి దారితీశాయి. ఈ కేసులో పరీక్షకు ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పేరు చర్చనీయాంశంగా మారింది.

Jitendra Mishra: అయోధ్య రామమందిరానికి కొత్త సీఈవో.. నేటి నుంచే బాధ్యతలు

 IIT-Bombay

IIT-Bombay: ఎవరీ సూర్యనారాయణ దూళ్ల?

సూర్యనారాయణ దూళ్ల ఐఐటీ-బాంబేలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థల నియంత్రణ, పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానం వంటి అంశాల్లో ఆయనకు పరిశోధనా అనుభవం ఉంది. గతంలో ఐఐటీ-బాంబేలో విద్యార్థుల వ్యవహారాలకు సంబంధించిన పరిపాలనా బాధ్యతల్లోనూ పనిచేశారు. ఆయనకు బోధన, పరిశోధన రంగాల్లో పలు అవార్డులు, గుర్తింపులు లభించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 18న ఐఐటీ-బాంబేలో మిడ్‌-సెమిస్టర్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ప్రొఫెసర్ దూళ్ల ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వకోడ్ పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. ఐఐటీ-బాంబే ప్రకారం.. సాహిల్ ప్రశ్నపత్రాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌ అయిన చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని పరీక్షా విధానాల్లో భాగంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం కొన్ని గంటల్లోనే సాహిల్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత పరీక్షలో జరిగిన ఘటనతోనే విద్యార్థి ఆత్మహత్యకు సంబంధం ఉందన్న చర్చ సాగింది. అయితే సాహిల్ తండ్రి రవీంద్ర వకోడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఎస్సీ వర్గానికి చెందినవాడని, గత కొన్ని నెలలుగా అతడిని కులపరమైన వ్యాఖ్యలతో వేధించారని తండ్రి ఆరోపించారు. ప్రొఫెసర్ దూళ్ల తన కుమారుడిని కులం పేరుతో అవమానించారని, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగానే సాహిల్ తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబం ఆరోపించింది.

Read Also hindi news: hindi.vaartha.com

కర్నూలు బియ్యం ధరలకు రెక్కలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha