Visakha Gun misfire: విశాఖపట్నంలో గన్ మిస్‌ఫైర్ ఘటన తీవ్ర కలకలం రేపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన భద్రతా విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయి తీవ్రంగా గాయపడ్డారు.
Alang Road Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. ట్రైలర్‌ను ఢీకొన్న SUV, ఏడుగురు మృతి
ఏమి జరిగిందంటే?
విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్పలకొండ వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి గుండు దూసుకెళ్లడంతో ఆయన ఎడమవైపు ఛాతీ కింద భాగంలో తీవ్ర గాయమైంది.

అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలింపు
తుపాకీ పేలిన పెద్ద శబ్దం విన్న వెంటనే అక్కడే ఉన్న ఇతర భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న అప్పలకొండను గమనించి, వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు.
Epaper: epaper.vaartha.com

