Hormuz Strait: ఒమన్ తీరానికి సమీపంలోని కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో మరోసారి భద్రతా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న పనామా దేశ జెండా కలిగిన 'ఎంటీ ఆన్ పీస్' అనే వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని మంగళవారం ఒక రాకెట్ దాడి జరిగింది.
ఈ అకస్మాత్ దాడి ఘటనకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వివరాలను వెల్లడించింది.

17 మంది భారతీయులున్న నౌకపై దాడి: 12 మందికి గాయాలు
దాడికి గురైన ఆ వాణిజ్య నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ప్రయాణిస్తుండగా, అందులో దాదాపు 17 మంది భారతీయ నావికులే కావడం గమనార్హం. ఈ రాకెట్ దాడి కారణంగా మొత్తం 12 మంది సిబ్బంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మంది మన దేశానికి చెందిన నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Hormuz Strait: ఒమన్ అధికారుల సహాయంతో క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఒమన్ దేశ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వారి సహకారంతో ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఖసాబ్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ సహాయక చర్యలపై స్పందించి, క్షతగాత్రులను కాపాడటంలో సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
అంతర్జాతీయ జలమార్గా అయిన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులు జరుగుతుండటం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల మౌలిక సదుపాయాలను, అమాయక వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, సముద్ర వాణిజ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగేలా చూడాలని పిలుపునిచ్చింది.
తుకారాం ముండేకు అంతర్జాతీయ గుర్తింపు.. న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు

