IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది కానీ కొన్ని ఫ్రాంచైజీలకు మాత్రం ఇది కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని, నిరాశను మిగిల్చింది. వేలంలో కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసిన స్టార్ ఆటగాళ్లు మైదానంలో కనీస ప్రదర్శన చేయలేకపోయారు.
ముఖ్యంగా ప్లేఆఫ్స్ రేసు నుండి ముందే నిష్క్రమించిన జట్లలోని కొందరు ఆటగాళ్ల పారితోషికానికి, వారి ఆటతీరుకు అస్సలు పొంతనే లేకుండా పోయింది. వారు చేసిన ప్రతి పరుగుకూ ఫ్రాంచైజీలు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ జాబితాలో లక్నో ప్లేయర్ ప్రశాంత్ వీర్ ఒక్కో పరుగుకు ఏకంగా రూ.15.77 లక్షలు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తమ జట్లకు భారీ నష్టం మిగిల్చిన ఆ టాప్-10 బ్యాటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ipl 2026 most expensive flop players
భారీ ధర.. నిరాశాజనక ప్రదర్శన:
సూర్యకుమార్ యాదవ్ (MI): ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రూ. 16.35 కోట్ల భారీ ధరతో ఈ సీజన్ లో 270 పరుగులే చేశాడు. అతడి ఒక్కో పరుగు విలువ రూ. 6.05 లక్షలు. వీరిద్దరి వైఫల్యం ముంబైని బాగా దెబ్బతీసింది.
రుతురాజ్ గైక్వాడ్ (CSK): చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఆయన 337 పరుగులు మాత్రమే చేసి, కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యాడు. దీనితో అతడి ఒక్కో రన్ విలువ రూ. 5.34 లక్షలుగా తేలింది.
శ్రేయస్ అయ్యర్ (PBKS): పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో రూ. 26.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా, ఆయన చేసిన 498 పరుగులు ఆ భారీ పెట్టుబడికి న్యాయం చేయలేకపోయాయి. అతడి ఒక్కో పరుగు విలువ రూ. 5.37 లక్షలు.
రోహిత్ శర్మ (MI): ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రూ. 16.3 కోట్ల ధరతో కేవలం 283 పరుగులకే పరిమితమయ్యాడు. ఫలితంగా అతడి పరుగు విలువ రూ. 5.75 లక్షలుగా నమోదైంది.
Read also: Murugan Ashwin: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన మురుగన్ అశ్విన్
IPL 2026: ఫ్రాంచైజీల జేబులు ఖాళీ చేసిన స్టార్ ప్లేయర్స్:
కామెరాన్ గ్రీన్ (KKR): కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ ఆల్‌రౌండర్ కేవలం 322 పరుగులే చేయగలిగాడు. దీంతో కేకేఆర్ అతడి ఒక్కో పరుగుకు రూ. 7.82 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది.
హార్దిక్ పాండ్యా (MI): ముంబై కెప్టెన్ రూ. 16.35 కోట్ల ధరతో బ్యాటింగ్‌లో ఘోరంగా ఫ్లాప్ అయి 206 పరుగులే చేశాడు. అతడి పరుగు విలువ రూ. 7.93 లక్షలు.
రిషబ్ పంత్ (LSG): లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 312 పరుగులు మాత్రమే చేసి జట్టును నడిపించలేకపోయాడు. అతడి సింగిల్ రన్ విలువ రూ. 8.65 లక్షలు.
నికోలస్ పూరన్ (LSG): లక్నో జట్టులోనే ఉన్న పూరన్ (ధర రూ. 21 కోట్లు) 234 పరుగులకే పరిమితమవడంతో అతడి పరుగు విలువ రూ. 8.97 లక్షలుగా తేలింది.
అక్షర్ పటేల్ (DC): ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ రూ. 16.5 కోట్ల ధరతో కేవలం 173 పరుగులే చేశాడు. దీంతో అతడి పరుగు విలువ రూ. 9.53 లక్షలు పెరిగింది.
టాప్‌లో నిలిచిన ప్రశాంత్ వీర్:
ఈ జాబితాలో అందరికంటే టాప్‌లో నిలిచాడు లక్నో ప్లేయర్ ప్రశాంత్ వీర్ (ధర రూ. 14.2 కోట్లు). ఆయన ఈ సీజన్ లో ఆడింది కొన్ని మ్యాచ్‌లే, చేసింది కేవలం 90 పరుగులు మాత్రమే. దీనితో అతడి ఒక్కో పరుగుకు ఫ్రాంచైజీ ఏకంగా రూ. 15.77 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. ఐపీఎల్ లో కేవలం భారీ ధరలు పెట్టినంత మాత్రాన విజయాలు దక్కవని, ప్రదర్శన ముఖ్యామని ఈ సీజన్ గణాంకాలు ఫ్రాంచైజీలకు గట్టి గుణపాఠం చెప్పాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

