Murugan Ashwin: భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఈ 35 ఏళ్ల స్పిన్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన నోట్‌ను పోస్ట్ చేస్తూ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికారు.
భవిష్యత్తుపై నజర్.. పోటీ క్రికెట్‌లో కొనసాగుతా
తన రిటైర్మెంట్ ప్రకటనలో మురుగన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవాళీ మరియు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. అయితే క్రికెట్ నుంచి పూర్తిగా దూరం కావడం లేదు. కొత్త సవాళ్లను, విభిన్న అవకాశాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది, భవిష్యత్తులోనూ పోటీ క్రికెట్‌లో భాగం కావాలని ఆశిస్తున్నాను" అని అశ్విన్ పేర్కొన్నారు.
murugan ashwin announces retirement from ipl
Murugan Ashwin: ఆరుగురు కెప్టెన్లు.. దిగ్గజాల సారథ్యంలో
మురుగన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో మొత్తం ఆరు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ సుదీర్ఘ లీగ్ ప్రయాణంలో భారత క్రికెట్ దిగ్గజాలైన ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి గొప్ప నాయకుల ఆధ్వర్యంలో ఆడే అవకాశం దక్కిందని ఆయన గుర్తుచేసుకున్నారు. వారి మార్గదర్శకత్వంలో ఆడటం వల్ల ఒక క్రికెటర్‌గా తాను ఎంతో మెరుగయ్యానని సంతోషం వ్యక్తం చేశారు.
తమిళనాడు క్రికెట్‌తో ప్రత్యేక బంధం
తనను ప్రోత్సహించిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)కు అశ్విన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనమైన రికార్డుతో కెరీర్‌ను ముగించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
సువారెజ్ సంచలన హ్యాట్రిక్‌తో ఫిలడెల్ఫియాపై 6-4తో మెస్సి సేన ఘనవిజయం!

