Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ చరిత్రలో 15 ఏళ్ల వైభవ్ సరికొత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో 15 ఏళ్ల వైభవ్ సరికొత్త రికార్డు

వార్త 6 days ago

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ సంచలనం, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి పరుగుల విధ్వంసం సృష్టించాడు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కేవలం తన మెరుపు బ్యాటింగ్‌తోనే కాకుండా, సిక్సర్ల సునామీతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Read Also :IPL 2026 Playoffs Race: ప్లే ఆఫ్స్ రేసులో ఏడు జట్ల మధ్య రసవత్తర పోరు

ఈ సీజన్‌లో ఇప్పటివరకు వైభవ్ ఏకంగా 43 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ 42 సిక్సర్లు కొట్టి నెలకొల్పిన రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో వైభవ్ కొట్టిన 43 సిక్సర్లలో 35 సిక్సర్లు కేవలం పవర్‌ప్లేలోనే రావడం విశేషం. అంటే మొదటి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్ల పని పడుతూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో అతనిలో ఉన్న ఇంతటి పవర్ హిట్టింగ్ సామర్థ్యం చూసి క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

తొలి బంతికే సిక్సర్.. పడిక్కల్, నరైన్ సరసన వైభవ్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లుంగీ ఎన్గిడి వేసిన తొలి బంతికే వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్ బాదాడు. దీనితో ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో మూడుసార్లు తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టిన నలుగురు నయా రేంజ్ ఆటగాళ్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. గతంలో షారుఖ్ ఖాన్ (2023), సునీల్ నరైన్ (2025) ఈ ఘనత సాధించగా.. తాజా మ్యాచులో ఆర్‌సీబీ స్టార్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. వెనువెంటనే వైభవ్ కూడా అదే ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Vaibhav Suryavanshi: పరుగుల వేటలో యశస్వి జైస్వాల్‌నే పక్కకు నెట్టేసి..!

రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయాడు. జట్టులోని సీనియర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కంటే కూడా అత్యంత వేగంగా పరుగులు సాధిస్తూ జట్టు బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో వైభవ్ 486 పరుగులు చేశాడు. ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే ఆయన ఏకంగా 234.78 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కేవలం 14 పరుగుల తేడాతో 500 పరుగుల మైలురాయిని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని నిలకడ మరియు లీన్ హిట్టింగ్ చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాకు ఒక అద్భుతమైన స్టార్ దొరికేసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీలీల డేటింగ్ పుకార్లపై స్పందించిన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha