IPL 2026 Playoffs Race: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మొత్తం 62 లీగ్ మ్యాచ్‌లు పూర్తికాగా, పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే తన ప్లే ఆఫ్స్ స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకుంది.
ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పేలవ ప్రదర్శనతో టోర్నీ నుండి అధికారికంగా నిష్క్రమించాయి. మిగిలిన మూడు ఖాళీ స్థానాల కోసం ప్రస్తుతం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ఐదు జట్లకు ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉండగా, రెండు జట్ల భవితవ్యం ఇతరుల ఫలితాలపై ఆధారపడి ఉంది.
IPL 2026 Playoffs Race:ప్లేఆఫ్స్ బెర్త్ కోసం సన్‌రైజర్స్
పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమైంది. గణాంకాల ప్రకారం ఆ జట్టుకు 99.20 శాతం అవకాశాలు ఉన్నాయి. మరో మ్యాచ్ గెలిస్తే క్వాలిఫైయర్-1 ఆడేందుకు గుజరాత్ అర్హత సాధిస్తుంది. ఇక 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కు 75 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సొంత బలంపైనే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అయితే, ఈరోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తే ఆ జట్టు దారి సులువవుతుంది, లేదంటే రన్ రేట్ సమీకరణాలతో ముగింపు మ్యాచ్‌లో ఆర్సీబీని భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.
Read Also: Sreeleela Dating Rumours: శ్రీలీల డేటింగ్ పుకార్లపై స్పందించిన తల్లి

ఇక ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్, రాజస్థాన్ జట్లు ఓడిపోవడం బాగా కలిసివచ్చింది. ప్రస్తుతం సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలు 35.50 శాతంగా ఉన్నాయి. ఇవాళ సన్‌రైజర్స్‌పై, ఆ తర్వాత గుజరాత్‌పై విజయం సాధిస్తే 16 పాయింట్లతో చెన్నై రేసులో నిలుస్తుంది. కాకపోతే, రాజస్థాన్ రాయల్స్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాలి, లేదా రాజస్థాన్ కంటే చెన్నై మెరుగైన నెట్ రన్‌రేట్ సాధించాల్సి ఉంటుంది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలతో కుదేలైన పంజాబ్ కింగ్స్ అవకాశాలు 31.10 శాతానికి పడిపోయాయి. పంజాబ్ తన చివరి మ్యాచ్‌లో లక్నోపై గెలిచినా, ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన జట్ల ఓటములపైనే ఆధారపడక తప్పదు.
చివరి వరుసలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (10.60 శాతం అవకాశాలు), కోల్‌కతా నైట్ రైడర్స్ (13.90 శాతం అవకాశాలు) జట్లకు అద్భుతాలు జరిగితేనే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఈ రెండు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచినా స్వయంగా క్వాలిఫై కాలేవు; ఇతర జట్ల రన్ రేట్లు, ఓటములపై ఆధారపడాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, టోర్నీ నుండి ముందే అవుట్ అయిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పుడు మిగిలిన జట్ల జాతకాలను మార్చబోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై, లక్నోలతో జరిగే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాలి. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా రాజస్థాన్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ భవితవ్యం కూడా లక్నోతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

