Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్

ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్

వార్త 3 months ago

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్రేజ్ చూస్తుంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అచ్చం అసలు టికెట్లలాగే కనిపించే నకిలీ టికెట్లను సృష్టించారు. లక్నోలో జరుగుతున్న మ్యాచ్‌ల సందర్భంగా ఈ దందా బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.

Read also: KKR vs DC Highlights: ఫిన్ అలెన్ సునామీ సెంచరీ.. కేకేఆర్ ఘనవిజయం

 Police arresting fake IPL ticket gang

IPL 2026: నలుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్ల అరెస్ట్

లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. స్టేడియం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిసింది. చాట్‌జీపీటీ, అత్యాధునిక గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఈ టికెట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అమాయక అభిమానులే వీరి లక్ష్యం

స్టేడియం బయట టికెట్లు దొరకని అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా అధిక ధరలకు నకిలీ టికెట్లు అంటగట్టింది. ఒక అభిమాని వద్ద ఉన్న టికెట్ స్కాన్ కాకపోవడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా అధికారిక కౌంటర్లలోనే టికెట్లు కొనాలని పోలీసులు క్రికెట్ ప్రియులకు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సొంతగడ్డపై గెలిచి టాప్-4 లో చేరాలని గుజరాత్ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha