గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ జోరును ప్రదర్శిస్తూ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది.
మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించి టైటిల్ పోరుకు సిద్ధం చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో గుజరాత్ తలపడనుంది.
rcb into finals
Read also: Gujarat Titans Wickets Fall:పీకల్లోతు కష్టాల్లో.. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన GT
IPL 2026: ధర్మశాలలో ఆర్సీబీ పరుగుల సునామీ.. కొండంత లక్ష్యం!
ధర్మశాల మైదానంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ, ఆర్సీబీ బ్యాటర్లు వారి నిర్ణయాన్ని తప్పు నిరూపిస్తూ పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19) వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించగా విరాట్ కోహ్లీ (43), దేవదత్ పడిక్కల్ (30)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత జేసన్ హోల్డర్ ఒకే ఓవర్లో కోహ్లీ, పడిక్కల్‌లను అవుట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
కానీ ఆ తర్వాత అసలు సిసలైన విధ్వంసం మొదలైంది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగి 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా కృనాల్ పాండ్య (43) కూడా వేగంగా ఆడటంతో ఆర్సీబీ హిమాలయమంత స్కోరు సాధించింది.
తెవాటియా ఒంటరి పోరాటం వృథా.. గుజరాత్ ఘోర పరాజయం!
255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (14), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) త్వరగానే పెవిలియన్ చేరారు. జోస్ బట్లర్ (29) కాస్త వేగంగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ దశలో రాహుల్ తెవాటియా (68) జట్టు పరువు కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో అతని శ్రమ వృథా అయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో రాణించగా, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య, రసిఖ్ సలామ్ దార్‌లకు తలా రెండు వికెట్లు దక్కాయి.
రేపు (మే 27) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో మే 29న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

