MLS 2026: రాబోయే 'ఫిఫా ప్రపంచకప్ 2026' (FIFA World Cup 2026) బ్రేక్‌కు ముందు మెస్సి సేన ఇంటర్ మైయామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మేజర్ లీగ్ సాకర్ (MLS) రెగ్యులర్ సీజన్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంటర్ మైయామి 6-4 గోల్స్ తేడాతో ముంబై తరహా ఊహించని కంబ్యాక్ విజయాన్ని నమోదు చేసింది.
స్టార్ స్ట్రైకర్ లూయిస్ సువారెజ్ (Luis Suarez) అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా.. జర్మన్ బెర్టెరామ్ రెండు గోల్స్, మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్ ఒక గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మైయామి లీగ్‌లో వరుసగా నాల్గవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Read Also :Travis Head Wife Online Threats:ట్రావిస్ హెడ్ భార్యపై దాడులు చేస్తామంటూ సైబర్ వేధింపులు!
తొలి సగం: గోల్స్ వరద.. 4-4తో సమం
Luis Suarez Hat-trick MLS 2026
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు మైండ్ బ్లోయింగ్ అటాకింగ్‌తో దూసుకెళ్లాయి. ఫిలడెల్ఫియా జట్టు మ్యాచ్ ప్రారంభమైన 4వ మరియు 10వ నిమిషాల్లోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు గోల్స్ కొట్టి 2-0తో మైయామిపై ఒత్తిడి పెంచింది. అయితే, 13వ నిమిషంలో లయనల్ మెస్సి (Lionel Messi) అందించిన అద్భుతమైన అసిస్ట్‌ను ఉపయోగించుకుని బెర్టెరామ్ క్లోజ్ రేంజ్ నుండి మైయామికి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 20వ నిమిషంలో ఫిలడెల్ఫియా మరో గోల్ చేయడంతో స్కోరు 3-1గా మారింది.
ఈ దశలో మైయామి ఆటను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. 29వ నిమిషంలో ఇయాన్ ఫ్రే ఇచ్చిన పాస్‌ను లూయిస్ సువారెజ్ అద్భుతమైన వాలీ షాట్‌తో గోల్‌గా మలిచాడు. అనంతరం 42వ నిమిషంలో మెస్సి అందించిన మరో పాస్‌ను బెర్టెరామ్ రైట్-ఫుట్ ఫినిషింగ్‌తో నెట్‌లోకి పంపి స్కోరును 3-3తో సమం చేయడమే కాకుండా మైయామి జెర్సీలో తన తొలి బ్రేస్‌ను నమోదు చేశాడు. మొదటి సగం ముగిసేందుకు కొద్ది నిమిషాల ముందు (44వ నిమిషం) సువారెజ్ తన రెండో గోల్‌తో మైయామిని 4-3 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ, ఫస్ట్ హాఫ్ ఇన్‌జ్యూరీ టైమ్ (45+8వ నిమిషం) లో ఫిలడెల్ఫియా కోలుకుని మరో గోల్ చేయడంతో తొలి సగం ముగిసేసరికి ఇరు జట్లు 4-4తో హోరాహోరీగా నిలిచాయి.
MLS 2026: సెకండ్ హాఫ్‌లో సువారెజ్ హ్యాట్రిక్.. డి పాల్ ఫినిషింగ్ టచ్
రెండో సగంలో ఇరు జట్ల రక్షణ శ్రేణి గట్టి పోటీని ఇచ్చింది. చివరకు 81వ నిమిషంలో బెర్టెరామ్ ఇచ్చిన కచ్చితమైన అసిస్ట్‌ను సువారెజ్ ఏమాత్రం పొరపాటు చేయకుండా గోల్‌గా మలిచి తన ‘హ్యాట్రిక్’ను పూర్తి చేయడంతో మైయామి 5-4తో లీడ్ సాధించింది. ఇక మ్యాచ్ ముగిసే దశలో (90+3వ నిమిషం) ఇంటర్ మైయామి కౌంటర్ అటాక్‌కు దిగింది. సిల్వెట్టి అందించిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో డి పాల్ (Rodrigo De Paul) బాక్స్ కుడి వైపు నుండి క్లాసిక్ ఫినిషింగ్‌తో గోల్‌గా మార్చి ఇంటర్ మైయామికి 6-4తో అపురూప విజయాన్ని ఖరారు చేశాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

