UN Blacklist: యుద్ధ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శక్తివంతమైన రష్యా, ఇజ్రాయెల్ దేశాల సైన్యాలను ఈ జాబితాలో చేర్చడంపై ఆయా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్యాంశాలు.. గత 15 సంవత్సరాలుగా ఐరాస విడుదల చేస్తున్న ఈ తరహా నివేదికల్లో ఇజ్రాయెల్ పేరు ఎప్పుడూ లేదు. కానీ, పాలస్తీనా (గాజా) ఘర్షణల్లో ఇజ్రాయెల్ దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు, లైంగిక దాడులకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని ఐరాస స్పష్టం చేసింది.
Read Also: Iran Internet: ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!
UN Blacklist
UN Blacklist: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దురాగతాలు:
ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యా సైనికులు యుద్ధ ఖైదీలను, సాధారణ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఐరాస ఆరోపించింది. ఈ కారణంతోనే రష్యాను సైతం ఈ నల్లజాబితాలో (Blacklist) చేర్చారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ నిప్పులు చెరిగారు. తమ దేశ సైన్యాన్ని హమాస్, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చడం దారుణమని, ఇకపై ఐరాస సెక్రటరీ జనరల్‌తో తమకు ఎలాంటి సంబంధాలు ఉండబోవని తేల్చి చెప్పారు. రష్యా రాయబారి వెసెల్లీ నింబెంజియా స్పందిస్తూ.. ఈ నివేదిక పూర్తిగా పక్షపాతంతో, రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నదని ఆరోపించారు. అంతర్జాతీయంగా రష్యా ప్రతిష్టను దెబ్బతీసేందుకే పాశ్చాత్య దేశాల ఒత్తిడితో ఐరాస ఇలాంటి తప్పుడు నివేదికలను సృష్టిస్తోందని మండిపడ్డారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
సీఐఏకు భారీ కన్నం: మాజీ అధికారి ఇంట్లో రూ.382 కోట్ల బంగారం, మిలియన్ల కొద్దీ నగదు!

