Ajit Agarkar: టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఘనంగా వీడ్కోలు పలికాడు. అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు సాధించిన విజయాలను గుర్తు చేసుకున్న గంభీర్..
ఆయన సేవలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశాడు.
Virat Kohli : కోహ్లి రూ.5 కోట్లు తీసుకున్నాడనే ప్రచారం అసలు క్లారిటీ ఇదే !!

అగార్కర్‌పై గంభీర్ ప్రశంసలు
అజిత్ అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని గంభీర్ పేర్కొన్నాడు. అగార్కర్ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. జట్టు ప్రయోజనాలకే ఎప్పుడూ అగార్కర్ ప్రాధాన్యం ఇచ్చారని గంభీర్ తెలిపాడు. ఆయన చేసిన సేవలను చరిత్ర భవిష్యత్తులో మరింత గొప్పగా గుర్తుంచుకుంటుందని పేర్కొంటూ.. అగార్కర్ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపాడు.
2023 జులైలో అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన పదవీకాలంలో భారత జట్టు పలు కీలక విజయాలను సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరగా.. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జట్ల ఎంపిక అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా చేపట్టిన చివరి బాధ్యతగా నిలిచింది.
Ajit Agarkar: మంగళవారంతో పదవీకాలం పూర్తి
అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం మంగళవారంతో అధికారికంగా ముగిసింది. ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం మాజీ భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు భారత్-ఏ జట్టుకు సంబంధించిన మూడు మ్యాచ్‌లకు జట్ల ఎంపికలోనూ ఓజా పాల్గొన్నాడు. ప్రస్తుత సెలెక్షన్ ప్యానెల్‌లో ప్రజ్ఞాన్ ఓజాతో పాటు శివసుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్ ఉన్నారు. కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక కోసం బీసీసీఐ అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అభ్యర్థి కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కనీసం 5 సంవత్సరాలు పూర్తై ఉండాలనే నిబంధన ఉంది.
Epaper: epaper.vaartha.com

