Lenin Movie Teaser: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' నుంచి అదిరిపోయే అప్‌డేట్. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం నాడు మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
కింగ్ నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Also : System Movie: లీగల్ డ్రామా 'సిస్టమ్' మూవీ రివ్యూ
Lenin Movie Teaser: రాయలసీమ యాస తో ఆకట్టుకునే డైలాగులు
విడుదలైన ఈ టీజర్‌లో అఖిల్ సరికొత్త మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు అఖిల్ చెప్పిన డైలాగులు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తు చేస్తున్నాయి.
"మనోడు వస్తున్నాడు.." అనే ఎలివేషన్ డైలాగ్‌తో పాటు..
"నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా"అంటూ అఖిల్ చెప్పే వాయిస్‌ఓవర్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అఖిల్ రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం విశేషం. "యాడికమ్మీ పోతుండావు.. ఈరోజు అటో ఇటో తేల్చేద్దామూ" అంటూ సాగే సీమ స్లాంగ్ డైలాగ్స్, హీరోయిన్‌తో సాగే రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. టీజర్ చివర్లో చూపించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి.
ఈ టీజర్‌ను నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'నాకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చారు' అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. టీజర్ చూస్తున్నంతసేపు చాలా హాయిగా అనిపించిందని నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నీలిరంగు గౌనులో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐశ్వర్య రాయ్!

