Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

వార్త 3 months ago

Telangana: రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూనుకుందో వివరిస్తూ, ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఇసుక మాఫియాపై కూడా విచారణ జరిపిస్తామని సీఎం వెల్లడించారు.

2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు కేటాయించిన అన్ని మైనింగ్ లీజుల వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read Also:road accident: నిర్లక్ష్యానికి మూల్యం

 Telangana: Revanth Reddy’s sensational decision on illegal mining

బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు

రాష్ట్రంలో సాగిన అక్రమ మైనింగ్‌కు బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వం వహించారని ముఖ్యమంత్రి నేరుగా ఆరోపించారు. వారి కనుసన్నల్లోనే రాష్ట్ర సంపద దోపిడీకి గురైందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ అక్రమాల వెనుక ఉన్న పాత్రధారులను బయటకు తీసేందుకు సీఐడీ (CID) విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఆశా వర్కర్ల ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha