Road accident : మానవ హృదయాలను కదిలించే మరో హృద య విదారక రోడ్డు ప్రమాదం 14 మందిని కబళించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదం ఇది రెండోది. రాత్రిపూట ఎంతో సంతోషంగా గమ్యం చేరేందుకు వీలుగా బస్సెక్కి ప్రయాణించేవారు తెల్లారేసరికి విగత జీవులుగా మారిపోవడం ఎంతో విషాదాన్ని నింపుతోంది.
మార్కాపురం జిల్లాలో రాయపూర్ పరిసరాల్లో టిప్పర్ను ప్రయివేటు బస్సొకటి ఢీకొనగా గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో 14 సజీవ దహనమవగా మరో 11 మంది చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్డు ప్రమాదాలన్నీ డ్రైవర్ల నిర్లక్ష్యం,(neglect) వాహనాలు కండి షన్లో లేకపోవడం వంటి కారణాలతోనే జరుగుతుంటాయని గత సంఘటనలు తేల్చిచెప్పాయి. మార్గమధ్యంలో ప్రయాణికులు బస్సు కండిషన్పై ఆందోళన వ్యక్తం చేసి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో బస్సు సిబ్బంది ఎర్రగొండ పాలెం వద్ద దాదాపు గంటసేపు బస్సును నిలిపి ఉంచి మరమ్మతులు చేశారు. రోడ్డుకు ఎడమ వైపు గా వెళ్లాల్సిన బస్ డ్రైవర్ మూలమలుపు దగ్గర ఎదు రుగా వచ్చే టిప్పర్ను అంచనా వేసుకోలేక ఢీ కొనడంతో డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. కొందరు అద్దాలు పగులగొట్టి బయటకురాగా మరికొంత మంది డ్రైవర్ సీట్లోంచి బయటకు వెళ్లబోయి మంటలకు ఆహు తయ్యారు. సజీవదహనమైన వారెవరి మృతదేహాలు గుర్తు పట్టేందుకు లేదు. వారి బంధువలు డిఎన్ఎ పరీ క్షలతో పాటే అది సాధ్యమౌతుంది.
Read Also : Ayodhya Rajghat Yagna Fire Accident: అయోధ్య మహా యజ్ఞంలో భారీ అగ్నిప్రమాదం: 1251 హోమ గుండాలు దగ్ధం
All road accidents occur due to driver negligence and poor condition of vehicles.
ఎన్నో కారణాలు
తొలుత బస్ డ్రైవర్ ను అధికారులు ప్రశ్నించినప్పుడు స్టీరింగ్ స్ట్రక్ అయిం దనే మాట వినవచ్చింది. కానీ ప్రమాదం జరిగినతర్వాత అధికారుల పరిశీలనలో తేలిందేమిటంటే డ్రైవర్ మానవ తప్పిదం వల్లనే ఇలా జరిగిందని స్పష్టం చేశారు. బస్సు కండిషన్ బాగుండకపోవడం, చాలా కాలంగా మరమ్మత్తులకునోచుకోకపోవడం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేకపోవడం వంటి ఎన్నో కారణాలను పరిశీలించి ప్రమాద కారణం విశ్లేషిం చే ప్రధాన బాధ్యత వాహన యాజమాన్యం, రవాణా అధికారులది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో రాజుకున్న మంటల్లో వారి ప్రాణాలు సజీవ దహనమ య్యాయి. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయి. బస్సులో చెలరేగిన మంటల్లోంచి బయటికి వచ్చేందుకు ప్రయాణికులకు వేరే దారిలేకపోయింది. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సులోని ప్రయాణికులంతా తెలంగాణలోని జగిత్యాల జిల్లా నుంచి సొంత ఊళ్లకు వస్తున్నారు. ముందు భాగంలో ఉన్న వారంతా వేముల, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. ఒకే ఘటన ఒక్కసారిగా ఇంత మందిని పొట్టనపెట్టుకోవడం కలచివేస్తోంది. సంఘటన అనంతరం బస్సులోని 41 మంది ప్రయాణికుల్లో 28 మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రులకు తరలించారు. సజీవ దహన మృతుల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారు.
మానవవ తప్పి దామే
రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ముందునున్న తలుపు తెరుచుకోగా బస్సంతా మంటలు దావానలంలో వ్యాపించాయి. వెనుక అద్దాల తలుపు బద్దలు కొట్టి బయటకు వచ్చినవారేబతికి బయటపడ్డారు. తాజా ప్రమాదంలో కంకర లోడ్ వస్తున్న టిప్పర్ ఆయిల్ ట్యాంకర్ను బస్సు ముందు భాగం ఢీకొనగా ట్యాంకర్ పగిలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని వింజమూరు ప్రాంతం లోని వారు కొద్ది రోజుల క్రితం ఉపాధి కోసం తెలంగాణలోని ప్రాంతానికి వలసవెళ్లారు. జగిత్యాలలో బుధవారం సాయంత్రం 5 గంటలకు బయటు దేరిన ఈ ప్రయివేటు బస్సు ఉదయానికి కలిగిరి చేరాలి. వాళ్లంతా శ్రీరామ నవమి వేడుకలకు తిరిగొస్తున్నారు. వీటికి కారకులెవరో కారణమెవరో విశ్లేషిస్తే చివరకు తేలేది మానవవ తప్పి దామే. కానీ సజీవ దహనానికి గురైన వారి కుటుంబాల వేదన తీర్చేదెవరు? స్టీరింగ్ స్ట్రక్ అయినందునే అని సాంకేతికకారణం చూపినా దానికి బాధ్యత వహించాల్సిం ది. డ్రైవరు, అది బాగు చేయించి బయలుదేరాక మళ్లీ ఏమైందో ఏమోకానీ బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ను ఢీకొంది. స్టీరింగ్ స్ట్రక్ అనేది యాంత్రిక కారణమైనా ఫిటెనెస్స ర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు బాధ్యతారహి తంగా వ్యవహరించాలనుకోవాలి. ఏతావాతా రవాణా శాఖ నిర్లక్ష్యమూ (neglect)కన్పడ్తోంది.

If we analyze the causes and reasons for these, we ultimately find that it is human error.
ప్రత్యేక శ్రద్ధ
గత యేడాది అక్టోబరు నెలలో కర్నూలు జిల్లాలో ఓప్రైవేట్ బస్సు ఇలాంటి ప్రమాదానికి గురైతే 19మంది దుర్మరణం చెందారు. భారీగా అధికార యంత్రాంగం ఎంతో హడావుడి చేసింది. ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామన్న నేతలు ఇప్పుడేం చెబుతారు. బస్సుల ఫిట్నెస్, కండక్టర్, బస్సు కండిషన్ వంటి అంశాలపై రవాణా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉంటే మరో ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రతిరోజూ అన్ని బస్సులూ తనిఖీ చేయాల్సిన బాధ్యత నుంచి రవాణా అధికారులు తప్పించుకో జాలరు. జాతీయ రహదారుల్లో జరిగేప్రమాదాలు మానవ తప్పిదంవైపేవేళ్లు చూపిస్తున్నాయి. అతిసాధారణ ప్రయాణం అదుపుతప్పితే సామూహిక మరణాల అగ్నిగుండంగా మారిపోవటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. డ్రైవర్లకు తగిన శిక్షణ, విశ్రాంతి నియమాలు, ఎమెర్జెన్సీ భద్రతా ప్రమాణాలు, ప్రైవేట్ వాహనాల ప్రయాణాలపై నిరంతర తనిఖీలున్న నాడు ప్రమాదాల సంఖ్య తగ్గిపోయే అవకాశంఉంటుంది. ఇటీవల కర్నూలు బస్సు అగ్నికి ఆహుతైన సంఘటనలో 19 మంది చేవెళ్ల బస్సులారీ ప్రమాదం అనంతరం మరో ప్రమాదం ఆపలేకపోవడం విచారకరం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

