Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమంగా తరలిస్తున్న ఆల్ఫాజోలం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఆల్ఫాజోలం పట్టివేత

వార్త 3 months ago

Alprazolam Seized: సిద్దిపేట రింగ్ రోడ్డు లో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న ఆల్పాజోలంను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. పక్క సమాచారం మేరకు కల్లకుంట్ల కాలనీ వద్ద ఒక కారులో నుంచి మరో కారులోకి ఆల్ఫాజోలం మారుస్తుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముగ్గురిని పట్టుకున్నట్లు తెలుస్తుంది.

నిందితుల నుంచి మూడు సంచుల్లోని 39 కిలోల ఆల్పోజోలంను, రూ.85.36 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ సీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఓ కంపెనీలో కెమిస్ట్ గా పనిచేస్తున్న మరో వ్యక్తి ప్రధాన సూత్ర ధారిగా గుర్తించారు. నింధితుల్లో హైదరాబాద్ మదీనాగూడకు చెందిన వ్యక్తి, మరోకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సిద్దిపేట మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి జైలుకు తరలించినట్లు గా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(Alprazolam Seized) అధికారులు తెలిపారు. వీరి వెనుక ఎవరు ఉన్నారు..? ఎప్పటి నుంచి ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తుందని ఎన్ సీబీ అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha