E waste collection:తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బడులలో అక్టోబర్ 28 న ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ మిషన్ లైఫ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ తెలిపారు.
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై ఆలోచనలు పెంచడానికి ఈ డ్రైవ్ బాగా ఉపయోగపడుతుంది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీకి సెలవులు పొడిగింపు
E-waste drive in schools on October 28th
పాత వస్తువుల సేకరణ
పిల్లలు తమ ఇళ్లలోని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను బడికి తీసుకురావాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆ పరికరాలను తెరిచి చూడకూడదని స్పష్టంగా చెప్పారు. పిల్లలు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
E waste collection:క్విజ్ పోటీల నిర్వహణ
ఈ-వ్యర్థాల సేకరణ రోజున బడులలో పిల్లల కోసం క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా పర్యావరణ విషయాలపై మంచి జ్ఞానం పెరుగుతుంది. ఆ రోజు సేకరించిన సమాచారాన్ని సంబంధిత అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు వెళ్లాయి.
Epaper: epaper.vaartha.com

