Ponnam Prabhakar:హుస్నాబాద్ ప్రాంతంలో గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదలకు, సొంతిల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులో తొలి ప్రాధాన్యం దక్కుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు.
Hyderabad Green Water: కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్.. జలమండలి కొత్త ప్లాన్!

నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా
గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు అలాగే కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటువంటి అర్హులైన నిర్వాసితులకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Ponnam Prabhakar:దయనీయ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు అండగా
సొంతిల్లు లేక పూరి గుడిసెల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తిస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందించి వారి సొంతింటి కల నిజం చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం జరిగింది.
Epaper: epaper.vaartha.com

