UPI Payments: యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాపార వర్గాలు నడుంబిగించాయి.
దీనికి నిరసనగా వచ్చే అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ (No UPI Day) నిర్వహించాలని ట్రేడర్లు మరియు వివిధ బిజినెస్ అసోసియేషన్లు ఏకగ్రీవంగా నిర్ణయించాయి.

డిజిటల్ చెల్లింపుల బహిష్కరణ
ఆ ప్రత్యేక రోజున ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించబోమని, క్యూఆర్ (QR) కోడ్ స్కానర్లు అలాగే పేమెంట్ సౌండ్ బాక్సులను నల్లటి బట్టలతో కప్పి ఉంచాలని ట్రేడర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ మరియు ఆర్థిక సంస్థల విధానాలపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకే ఈ వినూత్న నిరసన పద్ధతిని ఎంచుకున్నట్లు వారు వెల్లడించారు.
UPI Payments: అన్ని సంఘాల సమన్వయంతో నిర్ణయం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంఘాలు మరియు అసోసియేషన్లతో లోతుగా చర్చించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ రవీంద్ర తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై అదనపు భారాలు మోపితే వ్యాపారాలు చేయడం కష్టమని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
యూపీఐ కొత్త ఛార్జీలపై ఎన్‌పీసీఐ క్లారిటీ.. చిన్న వ్యాపారులకు ఊరట

