Ssc exams:వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు.
అక్టోబర్ 30 నుంచి విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి విద్యార్థులకు వివరాలు అందించాలని అధికారులు సూచించారు.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీకి సెలవులు పొడిగింపు
Schedule for Class 10 examination fees released
ఎవరికి ఫీజు మినహాయింపు ఉంటుంది
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు టెన్త్ పరీక్ష ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరూ అన్ని సబ్జెక్టులకు కలిపి 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కంపార్ట్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకు 110 రూపాయలు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు 125 రూపాయలు చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా 60 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Ssc exams:చివరి తేదీలు ఎప్పుడంటే పూర్తి వివరాలు
విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. నిబంధనల ప్రకారం 50 రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు అవకాశం ఇచ్చారు. 200 రూపాయల జరిమానాతో డిసెంబర్ 3 నుంచి 14 వరకు, 500 రూపాయల ఫైన్‌తో డిసెంబర్ 16 నుంచి 28 వరకు చెల్లించవచ్చు. అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా పాఠశాల లాగిన్ ఉపయోగించి మాత్రమే ఈ ఫీజులు చెల్లించాలి.
Epaper: epaper.vaartha.com

