Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్టోబర్ వరకు అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీకు బ్రేక్!

అక్టోబర్ వరకు అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీకు బ్రేక్!

వార్త 2 weeks ago

US EB-5 : అమెరికాలో పెట్టుబడులు పెట్టి త్వరగా గ్రీన్ కార్డ్ (Green Card) సంపాదించాలనుకునే భారతీయ ధనవంతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (FY 2026) గానూ భారతీయులకు కేటాయించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ (EB-5) అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ఇమిగ్రేషన్ వీసాల కోటా పూర్తిగా ముగిసిపోయింది.

ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 5వ తేదీ నాటికే ఈ కోటా పరిమితి దాటిపోవడంతో, అక్టోబర్ వరకు భారతీయులకు ఈ కేటగిరీ కింద కొత్తగా ఎలాంటి visa లు జారీ చేయబోమని స్పష్టం చేసింది. అసలు ఏంటి ఈ EB-5 వీసా ప్రోగ్రామ్? అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డ్ పొందడానికి అత్యంత వేగవంతమైన మార్గంగా ఈ EB-5 వీసాను పరిగణిస్తారు. దీనిని ‘ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్’ అని కూడా పిలుస్తారు.

Read Also: US-F-1 Visa: అమెరికా ఎఫ్-1 వీసా స్లాట్లు దొరక్క విద్యార్థుల ఆందోళన

 US EB-5

US EB-5 : ఈ చట్టం ప్రకారం..

విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలోని ఒక కమర్షియల్ బిజినెస్‌లో కనీసం 8 లక్షల డాలర్లు (టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా లేదా గ్రామీణ ప్రాంతాల్లో) లేదా ఇతర ప్రాంతాల్లో అయితే 10.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.8.7 కోట్ల నుండి రూ.9 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలి. దీనితో పాటు అమెరికా పౌరులకు కనీసం 10 పూర్తికాల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. అయితే, అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం (INA) ప్రకారం.. ప్రతి ఏటా ఏ ఒక్క దేశానికి కూడా మొత్తం ఉపాధి ఆధారిత వీసాలలో 7 శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన (Per-country cap) ఉంది. భారత్ నుండి ఈ వీసాకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో, ఈ ఏడాది జూన్ లోనే కోటా పూర్తిగా అయిపోయింది. ట్రంప్ కొత్త గ్రీన్ కార్డ్ మెమోతో మారిన రూల్స్! ఈ వీసా కోటా ముగియడానికి కొన్ని రోజుల ముందే, అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ఒక వివాదాస్పద పాలసీ మెమోరాండం విడుదల చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమెరికా లో ఘోర విమాన ప్రమాదం..12 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha