Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా లో ఘోర విమాన ప్రమాదం..12 మంది మృతి

అమెరికా లో ఘోర విమాన ప్రమాదం..12 మంది మృతి

వార్త 2 weeks ago

Plane Crash in US : అమెరికాలో ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిస్సోరీ (Missouri) రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మిస్సోరీలోని బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ (Butler Memorial Airport) సమీపంలో ఈ ఘోరం జరిగింది. విమానాశ్రయం నుండి రన్‌వేపై రయ్‌న దూసుకెళ్లిన విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి కిందకు దూసుకువచ్చింది. రన్‌వేకు కేవలం 300 గజాల (300 Yards) దూరంలోనే ఈ విమానం తీవ్ర వేగంతో భూమిని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో విమానం దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయింది.

Read Also : లండన్ లో భారత సంతతి యువకుడు దారుణ హత్య

స్కైడైవింగ్ సాహసయాత్రలో ఊహించని విషాదం.. మృతుల్లో 11 మంది స్కైడైవర్లు

అత్యంత ఉత్సాహంగా స్కైడైవింగ్ (Skydiving) సాహస క్రీడలో పాల్గొనేందుకు వెళ్తున్న వారి జీవితాల్లో ఈ ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఈ విమానంలో స్కైడైవింగ్ చేయాలనుకున్న అడ్వెంచర్ ప్రియులను ఆకాశంలోకి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తూ మరణించిన 12 మందిలో 11 మంది స్కైడైవర్లు (సాహస వీరులు) ఉండగా, ఒకరు విమానాన్ని నడుపుతున్న పైలట్. ఆకాశం నుంచి పారాచూట్లతో దూకి సరికొత్త రికార్డులు సృష్టించాలనుకున్న వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. కాగా, సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక వాతావరణం సహకరించలేదా అనే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికా విమానయాన అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha