IMD Weather Update: భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ భారతదేశ వాతావరణ పరిస్థితులు, రాబోయే ఈశాన్య రుతుపవనాలపై కీలక అంచనాలను వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుండి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉండగా, అక్టోబర్ 15 నుంచి 21 మధ్య ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశిస్తాయని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది.
చెన్నైలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ' (NIOT) లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐఎమ్‌డీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర, తమిళనాడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ చంద్రమోహన్‌లతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు.
Read Also :El Nino impact: ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈసారి తగ్గనున్న చలి తీవ్రత!
IMD Weather Update: వర్షపాతం, ఉష్ణోగ్రతలు & ఎల్‌నినో ప్రభావంపై ఐఎమ్‌డీ విశ్లేషణ

- సాధారణ వర్షపాతం అంచనా: ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ భారతదేశంలో మొత్తంగా సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ మరియు కేరళ కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
- ఎల్‌నినో (El Nino) ప్రభావం: ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో ప్రభావం నవంబర్ చివరి వరకు కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గినా.. దాని ప్రభావాలు మార్చి 2027 వరకు కొనసాగవచ్చని ఐఎమ్‌డీ చీఫ్ పేర్కొన్నారు.
- తుపానుల ప్రభావం తక్కువే: తుపానులు దక్షిణ దిశగా ఏర్పడే అవకాశాలు ఉన్నందున దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలపై వాటి తీవ్రత తక్కువగా ఉండవచ్చని తెలిపారు.
- పెరిగిన అంచనాల కచ్చితత్వం: 2016-2020 మధ్య వాతావరణ అంచనాల్లో నమోదైన లోపం 7.9% ఉండగా, 2021-2025 కాలంలో అది 2.2%కి తగ్గి అంచనాల్లో కచ్చితత్వం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
- ముందస్తు విపత్తు చర్యలు: తమిళనాడు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏజెన్సీ ఇప్పటికే 1,400 ఆటోమేటిక్ రైన్ గేజ్‌లు, 100కు పైగా వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ప్రతి గ్రామ పంచాయతీలో వర్షమాపక యంత్రం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com

