Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అల్లు అర్జున్ 'రాకా' కోసం దీపిక నైట్ షిఫ్ట్..!

అల్లు అర్జున్ 'రాకా' కోసం దీపిక నైట్ షిఫ్ట్..!

వార్త 2 weeks ago

Deepika Padukone : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా కోసం ఆమె చూపిస్తున్న అంకితభావం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది

కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ :

ప్రస్తుతం దీపిక తన రెండో ప్రెగ్నెన్సీలో ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉన్నప్పటికీ 'రాకా' షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. తనకు సంబంధించిన సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రసవానికి ముందు షూటింగ్ షెడ్యూల్‌ను ముగించాలనే ఉద్దేశంతో ఆమె పనిచేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఏడో నెలలో ఉన్న సమయంలోనే దీపిక నైట్ షిఫ్టుల్లో షూటింగ్‌కు హాజరైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు, కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె పాల్గొన్నట్లు సమాచారం. దాదాపు ప్రతిరోజూ షూటింగ్‌లో పాల్గొంటూ ప్రాజెక్ట్ షెడ్యూల్‌కు అనుగుణంగా పనిచేయడం చిత్రబృందాన్ని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

దీపిక గర్భధారణ కారణంగా 'రాకా' నుంచి తప్పుకుంటారంటూ గతంలో ప్రచారం జరిగినప్పటికీ, చిత్రబృందం ఆ వార్తలను ఖండించింది. ఆమె పాత్రలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ సరసన దీపికతో పాటు మరికొందరు ప్రముఖ నటీమణులు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. భారీ బడ్జెట్, అట్లీ దర్శకత్వం, అల్లు అర్జున్ స్టార్‌డమ్‌తో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న 'రాకా'లో దీపిక పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి, తన వ్యక్తిగత జీవితంలో కీలక దశలో ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను పూర్తి చేసేందుకు దీపిక చూపిస్తున్న పట్టుదల 'రాకా'పై మరింత బజ్‌ను పెంచుతోంది.

నిర్మాతకు పదవి ఇచ్చిన సీఎం విజయ్..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha