Allu Arjun Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ చిత్రం 'రాకా' పై సినీ ప్రియుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రతి చిన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు దాటిపోయిందనే ప్రచారం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : Happy Birthday Mrunal Thakur : మృణాల్ నిలిచి గెలిచిన ధృవతార..!
Shah Rukh Khan to make a cameo in Allu Arjun’s ‘Raka’?
Allu Arjun Raaka Movie: రెండు భాగాలుగా ‘రాకా’? మేకర్స్ ఆలోచన అదేనా?
ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ (డిజిటల్, శాటిలైట్ హక్కులు) ఆశించిన స్థాయిలో జరగడం లేదని, దానికి తగ్గట్టుగా బడ్జెట్ రికవరీని ప్లాన్ చేయడానికి చిత్ర యూనిట్ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ భార తగ్గించుకోవడానికి, మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి రెండు భాగాలుగా తీసుకురావడమే సరైన నిర్ణయమని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినపడుతోంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందనా లేదా ప్రకటనా వెలువడలేదు.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్ర?
మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన ప్రత్యేక అతిథి పాత్రలో (Cameo Role) బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే సినిమా స్థాయి మరో రేంజ్‌కి వెళ్తుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రచారాలపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.
ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్.. శ్రీలంక షెడ్యూల్ రద్దు!

