Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్.. శ్రీలంక షెడ్యూల్ రద్దు!

ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్.. శ్రీలంక షెడ్యూల్ రద్దు!

వార్త 3 weeks ago

Jr NTR Dragon Movie: యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఇటీవల ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమవడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, వైద్యుల సూచన మేరకు తారక్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, కంగారు పడాల్సిన పనిలేదని ఆయన టీమ్ భరోసా ఇచ్చింది.

Read Also : Love O Love Movie: ఓటీటీలో అలరిస్తున్న 'లవ్ ఓ లవ్' మూవీ

 Temporary break for NTR’s ‘Dragon’ shoot… Sri Lanka schedule cancelled!

Jr NTR Dragon Movie: శ్రీలంక షెడ్యూల్ రద్దు.. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి

వైద్యులు ఎన్టీఆర్‌ను సుమారు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టం చేయడంతో, 'డ్రాగన్' చిత్రీకరణను మేకర్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ గాయం కారణంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన భారీ శ్రీలంక షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిసింది. ఎన్టీఆర్ కోలుకుని మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే.. అంటే సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ ప్రారంభంలో ఈ కొత్త షెడ్యూల్‌ను తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

రిలీజ్ డేట్‌లో మార్పు ఉందా?

సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్‌లో తిరిగి మళ్లీ ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు వచ్చినప్పటికీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ డెడ్‌లైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ఈ ప్రమాద ఘటన వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా #GetWellSoonNTR హ్యాష్‌ట్యాగ్ విశేషంగా ట్రెండ్ అవుతోంది. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని, మరింత పవర్‌ఫుల్‌గా కెమెరా ముందుకు రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

మృణాల్ నిలిచి గెలిచిన ధృవతార..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha