Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'డాన్ 3' వివాదంపై రణ్‌వీర్ స్పందన.. మౌనమే సమాధానమన్న హీరో

'డాన్ 3' వివాదంపై రణ్‌వీర్ స్పందన.. మౌనమే సమాధానమన్న హీరో

వార్త 2 weeks ago

'డాన్ ౩' వివాదంపై మౌనమే సమాధానమన్న రణ్‌వీర్ సింగ్

Don 3 Controversy : బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న 'డాన్ ౩' సినిమా వివాదం మరింత చర్చనీయాంశమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో సినీ కార్మిక సమాఖ్య సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రణ్‌వీర్ బృందం తొలిసారిగా స్పందించింది. అయితే ఆరోపణలపై నేరుగా మాట్లాడకుండా గౌరవప్రదమైన మౌనమే తమ వైఖరి అని తెలిపింది. వృత్తిపరమైన విషయాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలనే నమ్మకం రణ్‌వీర్‌కు ఉందని ఆయన ప్రతినిధులు వెల్లడించారు. ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన భవిష్యత్ సినిమాలపైనే ఆయన దృష్టి పెట్టారని పేర్కొన్నారు.

షూటింగ్‌కు ముందు వైదొలగడంతో భారీ నష్టం ఆరోపణ

దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రూపొందిస్తున్న 'డాన్ ౩' చిత్రంలో హీరోగా రణ్‌వీర్‌ను రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు ఆయన తప్పుకోవడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం ఇప్పటికే హోటల్ బుకింగ్‌లు, విదేశీ ప్రయాణ ఏర్పాట్లు, చిత్రీకరణ స్థలాల ఖరారు వంటి పనులు పూర్తయ్యాయని తెలిపారు. దాదాపు రెండు వందల మందికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన కారణంగా నిర్మాతలకు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సినీ కార్మిక సమాఖ్యకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

Read Also : కలెక్టరేట్లో అనంత శ్రీరామ్ కంపెంట్

 Don 3 Controversy

సమాఖ్య పిలుపునకు స్పందించని రణ్‌వీర్

ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సినీ కార్మిక సమాఖ్య రణ్‌వీర్ సింగ్‌కు మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆయనతో ఎవరూ కలిసి పనిచేయవద్దని సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కారనే సందేశాన్ని పరిశ్రమకు ఇవ్వాలనేదే తమ ఉద్దేశమని సమాఖ్య పేర్కొంది. రణ్‌వీర్ వ్యక్తిగతంగా సమావేశమై వివరణ ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వివాదంలో పెద్ది ఐటెం సాంగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha