Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమలుకాని చట్టాలెందుకు?

అమలుకాని చట్టాలెందుకు?

వార్త 1 week ago

Laws : మానవజాతిని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలు, ధూమపానాలను పారద్రోలే విషయంలో పాల కుల ఆరాటమే కానీ పోరాటం త్రికరణశుద్ధిగా లేదని చెప్పాలి. ఈ రెండు వ్యసనాల వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని, రోగస్తులై, మంచానికే పరిమితమై కృంగి, కృశించి ప్రాణాలు వదులుతున్నారనే విషయం పాలకులకు తెలియంది కాదు.

చట్టాలు చేస్తున్నారు. ఉప న్యాసాలు ఇస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ త్రిక రణ శుద్ధిగా వీటిని నియంత్రించేందుకు మాత్రం ప్రయ త్నాలు జరగడం లేదేమోననిపిస్తున్నది. కొందరిని కొంత కాలం మోసం చేయొచ్చు. అందరిని కొంతకాలంమోసం చేయొచ్చు. అందరినీ ఎల్లకాలం మోసం చేయాలంటే అది భ్రమే అవుతుంది. అలా ప్రజలను మోసం చేసిన వారు, వేధించిన వారు ఎందరో చక్రవర్తులు, రాజులు, మరెందరో నేతలు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసి పోయారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ప్రజావస రాలను గుర్తించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఆదరాభిమానాలు పొంది వారి హృదయాల్లో చిరస్థాయి గా స్థానం సంపాదించుకున్న నాయకులు ఎందరో ఉన్నా రు. మాదకద్రవ్యాల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వా లు, అటు కేంద్ర ప్రభుత్వం నిరోధించేందుకు గట్టిప్రయ త్నాలే చేస్తున్నట్లు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా కన్పించడం లేదు.

 Laws

Laws : విస్తరించిపోతున్నా మాదక ద్రవ్యాలు

రోజురోజుకు మాదక ద్రవ్యాలు విస్తరించిపోతున్నాయి. ఒక వ్యూహం ప్రకారం ఎప్పటికప్పుడు దారులు మార్చుకుంటూ వినియోగదారు లను పెంచుకుంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇరవై యేళ్లలోపు ఉన్న యువతీయువకులు ఈ మత్తు లోపడి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. నేరాలు, ప్రమాదాలు అంతులేకుండా పెరిగిపోతున్నా యి. ఇక మద్యం విషయంలో ఆదాయాన్ని పెంచుకు నేందుకు పాలకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వాదుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది. మద్యం సరే. సారాను నిషేధించారు. కానీ ఏమాత్రం అమలు అవు తున్నదో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు పొరుగునున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు దొరకని ప్రాంతాలు ఉన్నాయేమోకానీ సారా దొరకని గ్రామం లేదు. గుడుంబా, నాటుసారా ఒక కుటీర పరిశ్రమగా రూపుదిద్దుకున్నది. అయితే కొన్ని రాష్ట్రాలు సారాను నిషేధించేందుకు చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టి అమాయకులకు కిక్కెకిస్తున్నారు. ఎక్కువగా అమ్ముడుపోతున్నది చీప్ లిక్కరే. ప్రజారోగ్యాన్ని కాటే స్తున్నది కూడా ఈ చీప్ లిక్కరే అనేది అందరికి తెలి సిందే. కల్తీ చీప్ లిక్కర్ తాగి ఎందరో ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా తరుచుగా చోటుచేసుకుం టున్నాయి. మద్యపానం, ధూమపానం రెండూ మానవ జాతిని పట్టిపీడిస్తున్న రెండు భూతాలు. ఒకటి బ్రహ్మ రాక్షసి అయితే రెండోది పిశాచి. ఇందులో మరో వాద నకు తావులేదు. మద్యపానాన్ని ఆదాయం ద ష్ట్యానియం త్రించలేకపోతున్నారు.

ప్రమాదకర విషవాయువులు

ధూమపానం విషయంలో కూడా విఫలమవుతున్నారేమోననిపిస్తున్నది. ఊపిరితిత్తుల కేన్స ర్, కిడ్నీ వ్యాధులు, మరెన్నో రోగాలకు ధూమపానం కేంద్ర బిందువుగా ఎందరో వైద్య నిపుణుల అధ్యయనం లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా నూట ముప్ఫైకోట్లమందికి పైగా ధూమపానంలో మునిగితేలుతున్నారు. యేడాది యేడాదికి విస్తరిస్తూనే ఉన్నది. భారతదేశానికి సంబం ధించి ఇరవై కోట్ల మందికిపైగా పొగాకుకు అలవాటు పడ్డట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో బీడీ తాగే వారే ఎక్కువ శాతం ఉన్నారు. బీడీలు, సిగరెట్లు తాగ డం సరదాగా ఆరంభమై ఆతర్వాత అలవాటుగా మారు తున్నది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఇందువల్ల రోగాల బారిన పడుతుంటే లక్షలాది మంది అసువులు బాస్తు న్నారు. సిగరెట్ పొగలో నాలుగువేల ఎనిమిది వందలకు పైగా ప్రమాదకర విషవాయువులు ఉన్నాయి. అవిఅనేక రోగాలకు కారణమవుతున్నాయి. అయితే ఈ బీడీ పరి శ్రమ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోట్లాది మందికి బతు కుతెరువు ఇస్తున్నదనేది కాదనలేని సత్యం. అడువుల్లో ఉన్న లక్షలాది మంది గిరిజన కుటుంబాలకు బీడీఆకుల సేకరణ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. కొన్ని శతా బ్దాలుగా అదొక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్నది.

 Laws

అమలు చేయలేని చట్టాలు

ఈ వాస్తవాలు పట్టించుకోకుండా బీడీ వినియోగాన్ని తగ్గిం చేందుకు ప్రయత్నం చేయడం అవివేకం అనిపిస్తున్నది. దీంతో వారంతా ఏకమై ఎదురుతిరగడం, రాజకీయ ఒత్తిడి తోడువకావడంతో విరమించుకోవాల్సి వస్తున్నది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు పొగాకు ఉత్పత్తు లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. యేటా నలభై వేలకోట్ల రూపాయలకు పైగా పొగాకు వ్యాపారం జరుగు తున్నదని అంచనా. లక్షలాది మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. వారితోపాటు మరెంతో మంది కూలీలు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా రు. ఆ కుటుంబాలు వీధి పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముందుగా వారికి ప్రత్యా మ్నాయం చూపించాలి. అవేమీ పట్టించుకోకుండా కాగి తాలపై చట్టాలుచేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే జీవనోపాధికోల్పో తున్నవారికి ప్రత్యామ్నాయంచూపి పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలి. అప్పుడే దీనికి పరిష్కారం దొరుకు తుంది. అంతేకానీ ఆచరణ సాధ్యం కానీ, అమలు చేయలేని చట్టాలు చేస్తే నవ్వుల పాలుకాక తప్పదు

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

తిరుమలలో హైటెక్ ఫుడ్ ల్యాబ్.. ఇకపై కల్తీకి తావే లేదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha