Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో హైటెక్ ఫుడ్ ల్యాబ్.. ఇకపై కల్తీకి తావే లేదు

తిరుమలలో హైటెక్ ఫుడ్ ల్యాబ్.. ఇకపై కల్తీకి తావే లేదు

వార్త 1 week ago

TTD Updates:తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా టీటీడీ అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు అందించే అన్నప్రసాదాలు, తాగునీరు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

గతంలో పరీక్షల కోసం నమూనాలను ఇతర ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది, దీనివల్ల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు స్థానికంగానే ఉన్న ఈ ల్యాబ్‌లో అన్ని పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాల ప్రకారం ఈ ల్యాబ్ నిర్మితమైంది. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా తొలి రిపోర్టును పరిశీలించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. రెండున్నర నెలల కాలంలోనే రూ.25 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు.

Read also: Anantapur: అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేలు

 Tirumala food analysis lab view

48 గంటల్లోనే రిపోర్టులు వచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు

గతంలో తాగునీటి నాణ్యత పరీక్షల నివేదిక రావడానికి పది నుంచి పదిహేను రోజులు పట్టేది. ప్రస్తుతం ఈ ల్యాబ్ ద్వారా తాగునీటిలోని బ్యాక్టీరియాపై ప్రాథమిక నివేదిక 48 గంటల్లోనే వస్తుంది. ఆహార పదార్థాలు, తాగునీటి శాంపిల్స్ పరిశీలన కోసం 50కి పైగా ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 30 మంది నిపుణులైన సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ నిరంతరం సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజూ వంటశాలలు, ప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్ల నుంచి 40 ఆహార నమూనాలు సేకరిస్తారు. అలాగే జలప్రసాదం, వాటర్ లైన్ల నుంచి 20 నీటి నమూనాలను పరీక్షించి నాణ్యతను నిర్ధారిస్తారు. దీనివల్ల శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతలో ఎటువంటి లోపాలు జరగకుండా కచ్చితమైన ఫలితాలు వస్తాయి.

TTD Updates:తిరుచానూరులో వైభవంగా సాగిన తెప్పోత్సవాలు

తిరుమల ల్యాబ్ వార్తలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. పద్మసరోవరంలో విద్యుద్దీపాల కాంతులతో శ్రీ కృష్ణస్వామివారి తెప్పోత్సవం భక్తులను కట్టిపడేసింది. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై మూడు ప్రదక్షిణలు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోవింద నామస్మరణతో ఆధ్యాత్మికానందాన్ని పొందారు. పాలతో సహా వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకం విశేషంగా సాగింది. తెప్పోత్సవం ముగిసిన తర్వాత స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి.

Epaper: epaper.vaartha.com

ద్రాక్షారామ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40 దుకాణాలు దగ్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha