Nara Lokesh Meets PM Modi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్, ఏపీ కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Also: AP Politics: ఎపి ఎంపీల తీరుపై షర్మిల ఘాటు విమర్శలు!
Nara Lokesh Meets PM Modi: ప్రధాని మోదీతో భేటీ
లోకేశ్ ప్రధానికి శాలువా కప్పి సాదరంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లోకేశ్‌ను అభినందించారు.అనంతరం లోకేశ్ బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి, బిల్లు ఆమోద ప్రక్రియలో ఆయన అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
రైతుల త్యాగాలకు దక్కిన గౌరవం - లోకేశ్ ట్వీట్
ప్రధానితో భేటీ తర్వాత లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు. "అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది ప్రజల తరపున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను."భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొని అమరావతి కలను సజీవంగా ఉంచిన మన రైతుల అసాధారణ కథను ప్రధానికి వివరించినట్లు లోకేశ్ పేర్కొన్నారు.రైతుల త్యాగానికి గౌరవంగా అమరావతిని నిజమైన ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడంలో ప్రధాని మార్గదర్శకత్వం కోరినట్లు ఆయన తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

