Dailyhunt
సింహ వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లు

సింహ వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లు

వార్త 2 weeks ago

Indrakeeladri Brahmotsavams: దుర్గమ్మవారి ఆలయంలో నాలుగోరోజు బుధవారం చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోకంగా నిర్వహించారు.

ఉదయం 8 గంటలకు శ్రీమల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో మూలమంత్ర హవనములను పూర్తి చేశారు. సాయంత్రం 5గంటలకు ఉపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లేశ్వరస్వామివారు అమ్మవార్లతో కలిసి సింహ వాహనంపై బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.

Read Also: AP Telangana Seed Corporation: సమన్వయంతో విత్తనాభివృద్ధి సంస్థ విభజన

 Indrakeeladri Brahmotsavams Sri Durga Malleswara Swamy on the Simha Vahanam

Indrakeeladri Brahmotsavams: సింహ వాహన సేవ

వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవార్ల వాహన సేవలో వలు రకాల విన్యాసాలతో భక్తులు ముందు సాగారు. కోలాటాలు, తప్పెట్లు, సాము గిరికీలు, భజన బృందాలు, శంఖ, భేరి, ధక్క ఢమరుక నాదాలతో స్వామి అమ్మవార్లకు పలు భక్తబృందాలు నీరాజనాలు పలుకుతూ వాహనసేవకు ముందుగా కదులుతుండగా తమ ప్రాంతాలకు వచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా ప్రాంత భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి పండ్లు, పూలు సమర్పించి మొక్కుకున్నారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఓ వికె శీవా నాయక్, పాలకమండలి. ఆర్చకస్వాములు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం

దుర్గమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల తరపున పలువురు ప్రముఖ పండితోత్తములు పాల్గొని కళ్యాణ రాయభారం జరిపారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్ర పఠనాలతో శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పమాలాకృతులను చేసిన అర్చకస్వాములు మంగళసూత్రధారణ గావించారు. కార్యక్రమంలో చైర్మన్, ఇది పాలకమండలి, విశేషసంఖ్యలో

భక్తుల సౌకర్యాలే ప్రధానం

బుధవారం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఓ వికె శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు సి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు వార్లు దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలసి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు గురించి క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. కనకదుర్గ నగర్ లో ప్రసాదాల కౌంటర్స్ ప్రక్కన భక్తులకు ఎండ వేడిమి నుండి రక్షించే షెడ్ ఏర్పాట్లు, సురక్షిత మంచి నీటి ప్లాంట్ ఏర్పాటు పరిశీలించి, బ్యాటరీ వాహనంలో ఘాట్ రోడ్ వైపు వెళ్లారు. ఘాట్ రోడ్లో ఆన్లైన్ సేవా కేంద్రం, దర్శనం క్యూలైన్లు మార్పులు, లగేజ్, చెప్పులు స్టాండ్స్ ప్రదేశాలను పరిశీలన చేశారు. వాహనాల పార్కింగ్ విషయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించి, భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైన సేవలు అందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ ద్వారా ప్రధాన ఆలయం వరకు ఈ బృందం ప్రయాణించి, భక్తులకు త్రాగునీరు, ప్యాన్ సౌకర్యాలు పరిశీలన చేశారు. లిఫ్ట్మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బెంచీలను ఇఓ వరిశీలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha