Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి పనులపై మంత్రి నారాయణ క్లారిటీ.

అమరావతి పనులపై మంత్రి నారాయణ క్లారిటీ.

వార్త 2 months ago

Amaravati Construction: రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో జగన్ విష ప్రచారం చేస్తున్నారని, మావిగన్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి నారాయణ విమర్శించారు.

మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులు పార్లమెంటులో చట్టం చేయించాలని కోరారని, ముఖ్యమంత్రి కేంద్రాన్ని పట్టుబట్టి చట్టం చేయించారని తెలిపారు.

Read also: Apples : కాశ్మీర్ ఆపిల్స్..ఇప్పుడు మన రాయలసీమలో సాగు !!

Amaravati capital construction works

Amaravati Construction: చట్టంపై చర్చ

పార్లమెంటులో చట్టంపై చర్చ జరుగుతుంటే ఎంపిలు ఏమి చేయాలో చెప్పకుండా ఇక్కడ మావిగన్ అంటూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఛీకొడుతున్నారని వివరించారు. జగన్ ప్రకటనల వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని విమర్శించారు. అమరావతికి ఇప్పటికే రూ.పదివేల కోట్లు ఖర్చయిందని, రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామని అన్నారు.

భూముల విలువ

అమరావతి నిర్మాణం జరిగితే ఎకరా రూ.20 కోట్లు అవుతుందని తెలిపారు. రాజధానిని 217 చదరపు కిలోమీటర్లకు ప్లాన్ చేశామని, అప్పుడు ప్రాజెక్టులు వారీ భూములు తీసుకుంటున్నామని అన్నారు. పెదపరిమిలో వెయ్యి ఎకరాలు ఒకేరోజు సమీకరణకు ఇచ్చారని పేర్కొన్నారు. పార్లమెంటులో సిఆర్డిఎ రీజియన్ను స్పష్టంగా ప్లాను చేశామని అన్నారు.

ఇతర ప్రాజెక్టులతో పోలిక

హైదరాబాద్ సెక్రటేరియట్కు రూ.615 కోట్లకు టెండర్లు ఇచ్చి రూ.1,423 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. పార్లమెంటులో రూ.862 కోట్లకు టెండర్లు పిలిచి రూ.1,172 కోట్లు ఖర్చు చేశారని, చదరపు అడుగుకు రూ.16,900 ఖర్చు చేశారని పేర్కొన్నారు. జాతీయ రహదారికి కేవలం రోడ్డువేసి వదిలేస్తారని, అమరావతిలో అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తున్నామనే విషయాన్ని జగన్ పార్టీ పట్టించుకోవడం లేదని అన్నారు.

అంచనాల పెరుగుదల

దోమలు లేని నగరం కావాలంటే 100 శాతం యుజిడి ఉండాలని పేర్కొన్నారు. లైట్లు, గ్రీనరీ 2014కు ముందే పూర్తయితే ఖర్చు తగ్గేదన్నారు. తారు, ఇనుము ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ధరలు పెరిగితే అంచనాలు పెరుగుతాయని, దీనికి గత ప్రభుత్వం పనులు చేయకపోవడమే కారణమని అన్నారు. పనులన్నీ టెండర్ల ద్వారానే ఇచ్చామని, నామినేషన్ పద్దతుల్లో ఇవ్వలేదని తెలిపారు. ఐదు వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు పక్కనబెట్టామని వివరించారు. వాటిని అమ్మి అప్పులు చెల్లిస్తామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఉపాధి హామీపై జాతీయ ఉద్యమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha