Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి రాజధాని బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

అమరావతి రాజధాని బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

వార్త 2 months ago

Amaravati Capital Bill Lok Sabha: బుధవారం లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు అర్థవంతమైన చర్చ జరిగింది. కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా దీనికి అనుకూలంగా ఓటు వేయడంతో, చైర్మన్ ఈ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారు. అత్యధిక సభ్యుల మద్దతు ప్రకారం చైర్మన్‌ ఆమోదం తెలుపడంతో సభ్యులు హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. రేపు (గురువారం) ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

Read Also:Tirupati: వెంకటగిరి జెడ్పీ హైస్కూల్‌లో భోజనం నాణ్యత తనిఖీ!

 Amaravati Capital Legal Status Bill

Amaravati Capital Bill Lok Sabha: వైసీపీ అభ్యంతరాలు – వాకౌట్

ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ కాలపరిమితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల నుంచి సుమారు 54 వేల ఎకరాలు సేకరించారని, ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విగ్రహాలతో రాజకీయ విన్యాసాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha