Idols : మానవుడు మరింత ఉన్నత లక్షణాలు కలిగి ఉండటానికి, ఒక ఉన్నత లక్ష్యాలను సాధించ డానికి తనకు ఇష్టమైన దైవ రూపాల ను లేదా రాజకీయ, సామాజిక సంస్కరణ వేత్తలను ఆదర్శంగా తీసు కుని తనకు, తన కుటుంబానికి తన దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా తయా రు అవడానికి విగ్రహాల రూపంలో దర్శించి ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం పరిపాటిగా ఉంటుంది.
అలాగే పాలకులు కూడా ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ప్రముఖులు విగ్రహాలు ఏర్పాటు చేయడం, వారి ఆశయాలను ఆచరణలో చేయడానికి ప్రయత్నాలు చేయడం గత అనాది కాలంగా వస్తున్న విధానం. అయితే గత నాలుగు దశాబ్దాలుగా మనదేశంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర పాలకులు (Rulers)వారి పాలనలో వారి పేర్లు శాశ్వతంగా చరిత్రలో నిలిచి పోయేరీతిలో, గిన్నీస్ బుక్లో రికార్డు సృష్టించడానికి కొంత మంది ప్రముఖులు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో యన్.టి.ఆర్చే హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బుద్ధవిగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహాలు ఏర్పాటు చేయడం తప్పుకాదు కానీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏర్పాటు చేయడం సమంజసం కాదు. ఇక ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ పాల కులు పక్కన పెట్టిన కొంతమంది స్వాతంత్ర్య సమరయోధు లను, వారి పార్టీల నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది.
Read Also : Ghantasala statue tribute: తిరుపతిలో ఘంటసాల స్మరణ.. ప్రతి నెల నివాళి కార్యక్రమం
idols
idols : కేవలం పేరు కోసమే
ఇక మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటు వంటి ధోరణులు, నేటి పాలకులు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలు విగ్రహాల ఏర్పాటుకు చర్యలు చేప ట్టడం జరుగుతుంది. గుజరాత్లో ప్రధాని మోడీ సుమారు 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సంద ర్భంలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న భారత్కు మేము ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవ సరం లేదు అని ఆనాడే బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా ప్రభుత్వం కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బాపూఘాట్/ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో సుమారు 1లక్షా 50వేలకోట్ల రూపాయలతో మూసీనది ప్రక్షాళన, మహాత్మాగాంధీ విగ్ర హం ఏర్పాటు చేయడం తన కర్తవ్యం అంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు సవ్యంగా జరగడం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవ లసిన డీఏలు, ఆర్థిక బకాయిలు, పి.ఆర్.సి, మధ్యంతర భృతి, రిటైర్ అయిన వారికి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయవలసి ఆవశ్యకత ఏమి ఉంది? కేవలం పేరు కోసమే అని గ్రహించాలి. దీనికితోడు రాష్ట్రం అప్పుల ఊబి లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
అప్పులతో సతమతం
ఎంత ఆదాయం వచ్చినా, అప్పులు తీర్చడం మాట అటుంచి, వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లక్షలకోట్ల రూపా యలు ఖర్చుచేసి విగ్రహం ఏర్పాటు చేయడం అవసరమా!? సాక్షాత్తు మహాత్మాగాంధీ మనవడే ఈ విగ్రహం ఏర్పాటు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి చేసే ఖర్చు పేద మధ్య తరగతి ప్రజల అవసరాలు కోసంవెచ్చించండి అని తెలిపారు. అయినా నేటి ముఖ్యమంత్రి గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ముందుకు సాగుతున్నారు. ఇక 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ఏర్పడిన నాటి నుంచి అప్పు లతో సతమతం అవుతున్నది. హైదరాబాద్ వంటి ఆదా యం సమకూర్చే నగరం ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం జరిగిం ది. రాజధానిలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేయాలని రాజధానిగా అమరావతి చేయాలని అప్పటి ప్రభుత్వం ముందుకు సాగుతున్న సమ యంలో హుదూద్ వంటి తుఫాన్ అతలాకుతలం చేసింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో కాలం గడుపుతూ, కనీసం రోడ్లుకూడా వేయకుండా, పరిశ్ర మలు ఏర్పాటు చేయకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన చర్యలు చేపట్టలేదు. సుమారు నాలుగు వందలకోట్ల రూపా యలు ఖర్చుచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేసి, వారి పేరు శాశ్వతం చేసుకో వడం జరిగింది.
idols
నిధు లు ఖర్చు చేయడం సమంజసమా!
ఇక రెండు సంవత్సరాల క్రితం అధికారం చేపట్టిన నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానా లు అమలు చేయడం కోసం తలకిందులుగా తపస్సు చేయ డం జరుగుతుంది. దీనికితోడు కొన్నిలక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది. అయినప్పటికీ, విగ్రహా లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. సుమారు 150కోట్ల రూపాయలు ఖర్చుచేసి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ విగ్ర హాన్ని సుమారు 2వేల కోట్ల రూపాయల పైబడి ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధంచేశారు. వచ్చిన ఆదాయం సరిపోక దాదాపు ప్రతీవారం అప్పులు కోసం పరిగెత్తుకుంటూ కేంద్ర ప్రభుత్వం వద్దకు, వివిధ ఆర్థికవ్యవస్థల వద్దకు వెళుతున్నా పరిస్థితిల్లో ఇంత భారీస్థాయిలో విగ్రహం ఏర్పాటుకు నిధు లు ఖర్చు చేయడం సమంజసమా! కావలిస్తే, వారి పేర్లు మీద విమానాశ్రయాలకు పేర్లుపెట్టడం, పేదవారికి ఉపయో గపడే వివిధ పథకాలకు, ఆ విగ్రహాలు ఏర్పాటుకుచేసే నిధు లు కేటాయించడం మంచిది. కేవలం పాలకులు వారి పేర్లు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవడానికి మాత్రమే ఈ విగ్రహా లను, ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. ఇకనైనా పాలకులు ఆలోచన మారాలి. విగ్రహాలు ఏర్పాటు ద్వారా ఓట్లు రాబట్టుకోవడం మంచిది కాదు. పర్యాటక రంగం అభివృద్ధికి, ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఈ విగ్రహాలను (పాజె క్టులను చేపట్టడం జరుగుతుంది అని పాలకులు (Rulers)చెబుతూ ఉంటారు. మన దేశంలో, రాష్ట్రాల్లో అధిక ధరలు, ద్రవ్యో ల్బణం, రూపాయి విలువ పతనం, పేదరికం,నిరుద్యోగం, కనీస అవసరాలు లేని పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు ఎనిమిది దశాబ్దాల పూర్తి అవుతున్నా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.మాటలు వెనుక పాలకుల మర్మం దాగి ఉందో ప్రజలు గ్రహించలేనంత వరకూ మోసపోతూనే ఉంటారు.
-ఐ.ప్రసాదరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఫిక్స్

