Amaravati Farmers: రాజధాని అమరావతిలో భాగంగా రెండో విడత భూసమీకరణకు భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ లబ్ధి చేకూర్చింది. గత నెలలో తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, వార్షిక కౌలు పెంపు ,వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీసీఆర్‌డీఏ 60వ సమావేశంలో తీసుకున్న తీర్మానాల ఆధారంగా రాజధాని ప్రాంత భూ సమీకరణ పథకం-2025 నిబంధనల్లో సవరణలు చేస్తూ జీవో జారీ అయ్యింది.
రైతులకు చెల్లించే వార్షిక కౌలును ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో మొదటి ఏడాది మెట్ట భూమికి ఎకరానికి రూ. 30 వేలు ఉండగా, తాజా సవరణతో దానిని రూ. 40 వేలకు పెంచారు. అలాగే జరీబు భూములకు గతంలో ఉన్న రూ. 50 వేల కౌలును రూ. 60 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కౌలును పదేళ్ల పాటు చెల్లించడంతో పాటు, ప్రతి ఏటా ఎకరానికి రూ. 3 వేల చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: GN Naidu: డాక్టర్ జీఎన్ నాయుడుకి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
Amaravati Farmers Lease Hike and Loan Waiver
Amaravati Farmers: రూ. 1.50 లక్షల రుణమాఫీ
భూసమీకరణలో భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తూ వ్యవసాయ రుణమాఫీని అమలు చేయనున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్ ఉన్న రైతులకు 2025 డిసెంబరు 2వ తేదీ కంటే ముందున్న రుణాలపై కుటుంబానికి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. దీనివల్ల వేలాది రైతు కుటుంబాలకు అప్పుల భారం తగ్గనుంది.
ప్లాట్ల కేటాయింపులో వెసులుబాటు
భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్ల విషయంలో కూడా నిబంధనలను సరళీకరించారు. గతంలో ఉమ్మడి ఆస్తి ఉన్న వారు విడివిడిగా ప్లాట్లు కావాలా లేదా ఉమ్మడిగా కావాలా అనేది ముందే చెప్పాల్సి ఉండేది. తాజా సవరణ ప్రకారం, ఫారమ్-5 ఒప్పందం పూర్తయిన తర్వాత కూడా ప్లాట్ల ప్రాధాన్యతను విడిగా తెలిపే అవకాశాన్ని కల్పించారు. సీఎం చంద్రబాబు చొరవతో వెలువడిన ఈ ఉత్తర్వుల పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

