NIELIT Quantum AI University : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పురోగతి లభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్ఠాత్మక సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) అమరావతిలో రూ.731.7 కోట్ల భారీ వ్యయంతో క్వాంటమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను నెలకొల్పనుంది.
ఇది రాజధాని ప్రాంతంలో సాంకేతిక విప్లవానికి, నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేయనుంది.
Read Also: Thalliki Vandanam Scheme: ఏపీ తల్లికి వందనం గడువు పొడిగింపు
NIELIT Quantum AI University
NIELIT Quantum AI University : నిడమర్రులో 10 ఎకరాల కేటాయింపు - క్యాంపస్ రూపకల్పన
అమరావతి పరిధిలోని నిడమర్రు వద్ద ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది: నీలిట్ మొదట 19 ఎకరాలు కోరగా, పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం 10 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించింది. అవసరాన్ని బట్టి ఈ లీజును మరొక 30 ఏళ్లు పొడిగించే వెసులుబాటు కల్పించారు. సుమారు 5.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో భవనాలు, పరిశోధనా కేంద్రాలు నిర్మించనున్నారు.2026 ఫిబ్రవరి 20న దిల్లీలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ప్రభుత్వం మరియు నీలిట్ ప్రతినిధుల మధ్య ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై ఎంఓయూ కుదిరింది. కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నీలిట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిజైన్ రంగాల్లో విద్య, పరీక్షలు, సర్టిఫికేషన్లు అందించడంలో విశేషమైన గుర్తింపు ఉంది. ఇటీవల ఈ సంస్థకు కేంద్ర విద్యాశాఖ 'డీమ్డ్ టు బి యూనివర్సిటీ' హోదా కూడా కల్పించింది. అమరావతి క్యాంపస్‌ను ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడ అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై కోర్సులు అందిస్తారు.

