ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక నిర్ణయమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ( Bandaru Sravani ) హర్షం వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రారంభమైన ఈ దివ్య ముహూర్తం ఐదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొత్త ఆశ రేపిందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పత్రిక ప్రకటన విడుదల చేస్తూ అమరావతి పై ఇప్పుడు చట్ట ముద్ర పడిందిఅని ఇక రాజధానిని నుంచి ఒక్క ఇటుక కూడా ఎవరూ కదిలించలేరు.
Read Also: AP Weather Alert: రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
Bandaru Sravani: Parliament’s legitimacy is historic for Amaravati
రాజధానిపై అప్రజాస్వామిక ప్రయోగాలు
ప్రజల త్యాగంతో నిర్మించిన ఈ రాజధానికి ఎవరైనా నష్టం చేయాలని చూస్తే ప్రజలే సమాధానం చెప్తారు" అని స్పష్టం చేశారు.ఇంతకాలం అమరావతి రైతులను మభ్యపెట్టి, రాజధానిపై అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టం అభివృద్ధి రాజధాని అమరావతి తప్ప మరొకటి కాదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.అలాగే అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడానికి పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పాలనాపరమైన అంకితభావాన్ని ఆమె ప్రశంసించారు.
Bandaru Sravani: ఆంధ్రుల ఆత్మగౌరవం
అమరావతి చట్టబద్ధత కోసం నిరంతరం శ్రమించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విభజన బాధల నుండి ముందుకు వచ్చిన నవ్యాంధ్రకి అమరావతి అజరామరమైన గుర్తు ఇది కేవలం నగరం కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం" అని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం స్పష్టమైంది. అమరావతి నుంచి ప్రపంచం వైపు అడుగులు వేయడానికి సమయం వచ్చేసింది. ప్రజల స్పూర్తితో, రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని శాశ్వతంగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలియజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

