Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని ఖండించిన జగన్

అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని ఖండించిన జగన్

వార్త 6 days ago

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తోందా లేక గూండాల రాజ్యం సాగుతోందా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీశారు. అమరావతి పరిధిలో పర్యటిస్తున్న వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా జగన్ ఘాటుగా స్పందించారు.

 Amaravati YSRCP Leaders Attack

పోలీసుల ముందే దాడులా? అమరావతి అవినీతిపై జగన్ ఆరోపణలు!

స్థానిక రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న తమ పార్టీ ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయడమేనని జగన్ మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు కూడా ఈ దాడికి సహకరించడం అత్యంత దారుణమన్నారు. అమరావతి పేరుతో సాగుతున్న అవినీతి, సామాన్య రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు.

రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను భూసేకరణ నోటీసులతో వేధిస్తున్నారని, వారి పొలాలకు వెళ్లే దారులను మూసివేస్తూ, అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని జగన్ దుయ్యబట్టారు. కొండవీటి వాగు నీటిని బలవంతంగా రైతుల పొలాల్లోకి మళ్లించి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబును హెచ్చరిస్తూ.. “ఈ రోజు మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి భవిష్యత్తులో అంతకుమించి సమాధానం ఉంటుంది. ప్రజలు ఈ అరాచకాలను క్షమించరు” అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు వైసీపీ భయపడబోదని, బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

తిరుమలలో భారీ రద్దీతో సోమవారం శ్రీవాణి, వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha