Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు

అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు

వార్త 2 weeks ago

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితను ‘మేకప్ మంత్రి’ అంటూ ఆయన చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. మహిళా హోంమంత్రి పట్ల ఇటువంటి వ్యక్తిగత మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని భావించిన కమిషన్, ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. రాజకీయ విమర్శల పరిధి దాటి, మహిళా ప్రజాప్రతినిధి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనే కోణంలో మహిళా కమిషన్ ఈ గట్టి చర్యకు ఉపక్రమించింది.

Read Also : అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల..ఎప్పుడంటే?

ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ఈ వివాదానికి సంబంధించి మహిళా కమిషన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఆయన స్పందించకపోతే లేదా విచారణకు హాజరుకాకపోతే.. బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులను ప్రాథమిక ఆధారాలుగా తీసుకుని చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. హోంమంత్రిపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శల సంస్కృతిపై సరికొత్త చర్చకు దారితీశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha