Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల..ఎప్పుడంటే?

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల..ఎప్పుడంటే?

వార్త 2 weeks ago

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు అదిరిపోయే తీపి కబురు చెప్పింది. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి విడత పెట్టుబడి సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు, సాగు ప్రారంభంలో రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

 Farmers Investment Support

read also: Palasa crime: రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణం

చిలకలూరిపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. రూ.3,125 కోట్ల నిధుల పంపిణీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శనివారం నిర్వహించనున్న అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ తొలి విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరి ఖాతాల్లో ఏకంగా రూ.3,125.47 కోట్లు జమ కానున్నాయి. లబ్ధిదారుల్లో 45.69 లక్షల మంది భూ యజమానులైన రైతులు ఉండగా.. అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేసుకుంటున్న 1.16 లక్షల పైచిలుకు గిరిజన రైతు కుటుంబాలు కూడా ఉన్నారు.

Annadata Sukhibhava: సూపర్ సిక్స్ హామీ అమలు.. అకౌంట్లలోకి రూ.7 వేలు!

కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో ఏపీ ప్రభుత్వం వాటా రూ.14,000 కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 ఇస్తుంది.

ఈ ఏడాదికి సంబంధించి ఇస్తున్న మొదటి విడతలో భాగంగా ఇప్పుడు ప్రతి రైతు ఖాతాలో ఒక్కో కుటుంబానికి రూ.7,000 చొప్పున జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000 కాగా, కేంద్రం వాటా రూ.2,000 గా ఉంది. కాగా, గత ఏడాది ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.8,985.41 కోట్లను రైతులకు అందజేసింది.

లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్

నిధుల విడుదల కార్యక్రమంతో పాటు సీఎం చంద్రబాబు శనివారం లింగంగుంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలిస్తారు. అనంతరం అన్నదాతలతో ముఖాముఖి (రైతు సదస్సు) నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో భేటీ అయి, ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతాంగానికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని అధికారులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం:కేంద్ర మంత్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha