Dailyhunt
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

వార్త 1 week ago

అంబటి రాంబాబుపై కొత్త కేసు

Ambati Rambabu case : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు నిర్వహించిన నిరసన దీక్ష కారణంగా ఈ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

నిరసన దీక్ష కారణం

తన ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆరోపిస్తూ అంబటి రాంబాబు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే గతంలో తనను కస్టడీలో హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also : Chandrababu Birthday: మిత్రులకు మరియు పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు: చంద్రబాబు

 Ambati Rambabu case

ట్రాఫిక్ ఇబ్బందుల ఆరోపణ

అనుమతి లేకుండా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టడంతో ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha